షర్మిల ఓదార్పుయాత్ర? లక్ష్యం చంద్రబాబేనా?

Publish Date:Oct 9, 2012

Advertisement

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల ఇకపై 2500కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు. ఆమె యాత్ర ఓదార్పుయాత్ర అని కాసేపు, జనచైతన్యయాత్ర అని మరికాసేపు వైకాపా నేతలు అంటున్నారు.  అయితే అంతిమలక్ష్యం మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీ కోసం వస్తున్న యాత్రకు ప్రత్యామ్నాయం.  బాబు యాత్రల ద్వారా రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగితే తమ పార్టీకి భవిష్యత్తు ఉండదన్న భయంతోనే వైకాపా ఈ యాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకించి చంద్రబాబు తన యాత్రలో స్పందన భారీగా ఉంటుందని ఊహించకుండానే యాత్ర మొదలుపెట్టారు. ఈ వందకిలోమీటర్ల దూరం నడిచేటప్పటికే స్పందన భారీస్థాయిలో కనిపిస్తోంది. దీని వల్ల వైకాపా ఇప్పుడు డిఫెన్సులో పడింది.  ఏ జనబలం చూసుకుని తాము ఇంతకాలం కాంగ్రెస్‌పై పెత్తనం చేసేందుకు ప్రయత్నించామో అది దెబ్బతింటుందనే భయంతోనే ఈ యాత్రను ఆ పార్టీ డిజైన్‌ చేసింది. సుమారు 2,500కిలోమీటర్ల పాదయాత్ర వల్ల ఇప్పుడు పెద్దగా ఒనగూరే ప్రయోజనమేముంటుందనేది ఒకసారి పరిశీలించాలి. జగన్‌ యాత్రలు ఆగిపోవటం వల్ల జనంలో ఉన్న సానుభూతి కొంత వరకూ తగ్గింది. ఉప ఎన్నికల్లో ప్రభావం చూపిన సానుభూతి మళ్లీ అవకాశం వచ్చినప్పుడు కూడగట్టుకోవచ్చు అనుకుంటే బాబు పాదయాత్రలకు స్పందన పెరిగింది. తటస్తులు బయటకు రావటం ప్రారంభించారు. ఈ తటస్థులను చూసుకునే జగన్‌ ధీమాగా ఉండేవారు. ఇప్పుడు బాబు పాదయాత్రలో ఎక్కువమంది తటస్తులున్నారని నివేదికలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత, లంచగొండితనం, అవినీతి వంటి అంశాలు తటస్థులను ఏదో ఒక పార్టీవైపు నడుపుతాయి. అటువంటి తటస్థులను ఇప్పుడు చంద్రబాబు వైపు చూస్తున్నారని ఓ రహస్యనివేదిక వైకాపాకు అందింది. దీంతో తమకు బలం అనుకున్న తటస్థులు, కార్యకర్తలు చంద్రబాబువైపు మారిపోకుండా ముందస్తు చర్యలు అవసరమని వైకాపా గుర్తించింది.

ఈ నేపథ్యంలోనే జగన్‌ రావటం లేదని వెనక్కి వెళ్లిన తటస్థులను, కార్యకర్తలను షర్మిల ఆకట్టుకోగలరని వైకాపానేతలు ఆశిస్తున్నారు. అందుకే ఈ యాత్రల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ యాత్రలే కనుక సక్సెస్‌ అయితే వైకాపాకు ఆదరణ పెరుగుతుంది. ఒకవేళ కాకపోతే వైకాపాపై తగ్గిన నమ్మకం ఎంతో తేల్చుకోవచ్చు. అందుకని ముందుగా ఓదార్పు యాత్ర కింద షర్మిలను పంపిద్దామనుకున్నారు. ఒకవేళ ఉపఎన్నికల్లో మాదిరి షర్మిల ఆవేశపూరిత ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటే జనచైతన్యయాత్ర అవుతుందని వైకాపానేతలు అనుకుంటున్నారు. అయితే పార్టీ పరిస్థితి, నిజమైన స్పందన ఎటు ఉంది తేల్చుకోవాలంటే షర్మిల యాత్రే కీలకం అన్న నిర్ణయానికి మాత్రం రాజకీయపరిశీలకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పరిణతి చెందిన పార్టీలతో సమానంగా తమ పరిస్థితిని అంచనా వేసుకోవటం వైకాపా తీసుకున్న చురుకైనచర్య అని అభివర్ణిస్తున్నారు. అయితే చంద్రబాబు యాత్రపై షర్మిల ప్రభావం ఎంతమాత్రం కనిపించదని అంచనా వేస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.