అక్రమ ఆర్థిక లావాదేవీలన్నీ సాయిరెడ్డికి తెలుసు సీబీఐ
Publish Date:Jan 3, 2012
Advertisement
హైదరాబాద్: వైయస్ జగన్ ఆస్తుల కేసులో కీలక సూత్రధారి విజయ సాయి రెడ్డేనని సిబిఐ వ్యాఖ్యానించింది. అక్రమ ఆర్థిక లావాదేవీలన్నీ విజయ సాయిరెడ్డికి తెలుసునని సిబిఐ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపింది. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఆస్తులు సంపాదించారని అన్నది. జగన్ ఆస్తుల కేసులో 70 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని చెప్పింది. మార్షియస్ నుంచి సండూర్ పవర్‌కు పెట్టుబడులు మళ్లించారని, ఆ తర్వాత అల్లిబిల్లి కంపెనీలు సృష్టించి వాటికి నిధులు మళ్లించారని, ఇందులో విజయసాయి రెడ్డిదే కీలక పాత్ర అని చెప్పింది. జగతి పబ్లికేషన్స్‌లోకి కూడా భారీగా పెట్టుబడులు తరలించారని ఆరోపించింది. సీబీఐ తమను అరెస్టు చేస్తుందని ముందే ఊహించినట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టు ఇంకా అందలేదని అన్నారు. తమను సీబీఐ కస్టడీకి ఇవ్వవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో సీబీఐ తనను అరెస్టు చేసిన దగ్గర నుంచి ఏయే ప్రశ్నలు వేశారు, ఏమీ అడిగారు అన్న విషయాలు కోర్టులో వివరిస్తానని విజయసాయి రెడ్డి అన్నారు. అయితే దీనికి చాలా సమయం ఉందని, తర్వాత చెప్పవచ్చునని కోర్టు తెలిపింది. విజయసాయి రెడ్డి న్యాయవాదితో మాట్లాడేందుకు మాత్రం గంట సమయం ఇచ్చింది.
http://www.teluguone.com/news/content/ys-jagan-assserts-24-10574.html





