కనపడకుండా పోయిన టీడీపీ ఎమ్మెల్యే తనయుడు
Publish Date:Jan 3, 2012
Advertisement
గుంటూరు: తెలుగుదేశం గుంటూరు జిల్లా వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు తనయుడు అఖిలేష్ అదృశ్యమయ్యాడు. మంగళవారం ఉదయం నుంచి అతని ఆచూకీ కనిపించడం లేదు. తన మిత్రుడు చందూతో కలిసి అఖిలేష్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. తన కుమారుడి అదృశ్యమైన విషయంపై ఆనంద బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గుంటూరు, కృష్ణా జిల్లాలో గాలిస్తున్నారు. తన కుమారుడు కిడ్నాపై ఉండడని, అలిగి వెళ్లిపోయి ఉంటాడని ఆయన చెప్పారు. అఖిలేష్ నల్లపాడులో లయోలా విద్యాసంస్థలో ఏడో తరగతి చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవుల తర్వాత పాఠశాలను మంగళవారమే తెరిచారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-24-10573.html
http://www.teluguone.com/news/content/tdp-24-10573.html
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026





