JNTUలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.!
Publish Date:Nov 16, 2026
Advertisement
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చదువుల కోసం యూనివర్సిటీకి వచ్చిన ఓ 19 ఏళ్ల విద్యార్థి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. గౌతమ్ బాయ్స్ హాస్టల్‌లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతిచెందడం కలకలం రేపింది. ఖమ్మం జిల్లాకు చెందిన రాజు విక్రమ్ బాబు (19) జేఎన్‌టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల వెలువడిన సెమిస్టర్ ఫలితాల్లో అతడు ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విద్యార్థి గదిలో అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించిన హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థులు వెంటనే స్పందించారు. అతడిని చికిత్స నిమిత్తం రామ్‌దేవ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనతో హాస్టల్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.చదువుల కోసం ఇంటికి దూరంగా ఉంటూ, ఉన్నత భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న 19 ఏళ్ల యువకుడు ఇలా అర్ధాంతరంగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక పరీక్షలో ఫెయిల్ కావడం జీవితంలో ఓటమి కాదనే విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి. పరీక్షల ఫలితాల కంటే జీవితం ఎంతో విలువైనది. చదువులో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకునేందుకు విద్యార్థులకు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు అండగా నిలవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థి మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మీకు నచ్చవచ్చు: పులివెందుల ఎంపీపీ ఎన్నికకు కొత్త చిక్కు.! మీకు నచ్చవచ్చు: స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లిన ఇండిగో మహిళా ఉద్యోగిని దారుణ హత్య.! [ Student suicide at JNTU, JNTU Hyderabad, JNTU Student Death, BTech Student, Mechanical Engineering, Gautam Boys Hostel, Raju Vikram Babu ]
http://www.teluguone.com/news/content/student-suicide-at-jntu-24-237200.html




