వేటు వేస్తే తాము దేనికైనా సిద్ధం: అంబటి

Publish Date:Dec 17, 2011

Advertisement

హైదరాబాద్: వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై వేటు వేస్తే తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.రాష్ట్రంలో ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని  చెప్పారు.   వైయస్ జగన్ అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర పాలక మండలి సమావేశం నిర్ణయాలను ఆయన  మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. తమ శాసనసభ్యులపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ వేటు వేస్తారో లేదో తెలియదని, అయితే తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఫీజుల బకాయిలను చెల్లించాలని డిమాండుతో వచ్చే నెల 4వ తేదీన ఒంగోలు జరిగే ధర్నాలో వైయస్ జగన్ పాల్గొంటారని ఆయన చెప్పారు. విద్యార్థులకు ఫీజుల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిాండ్ చేశారు

ఈ నెల 23వ తేదీన రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సదస్సులు జరుగుతాయని, జగన్ ఎక్కడ ధర్నాలో పాల్గొంటారనేది తెలియదని ఆయన అన్నారు. 108, 104 సర్వీసుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల్లో వైయస్ జగన్‌కు ఉన్న ఆదరణను చూసే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన విమర్శించారు.
 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి పాడ్ టాక్సీల కోసం మూడు మార్గాలను ఎంపిక చేశారు.  డిసెంబరు నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం మెట్రో రైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.  
భవనం పైకప్పు సమీపంగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో నాలుగో తరగతి చదువుతున్న రెబికా అనే 11 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన నందిని అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
అక్వాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఆ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక పోతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
సాయంత్రాలు ఒకింత సేదదీరుదామని పార్కులకు వెడదామనుకునే మధ్య తరగతి వేతన జీవులు, కష్ట జీవులకు ఇక పార్కులలో ప్రవేశం భారంగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులలో ప్రవేశ రుసుము ఇక దాదాపు రెట్టింపు కానుంది.
రాష్ట్రంలో ఆన్‌లైన్ ఫార్మసీ వేదికల ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)  దాడులు నిర్వహించారు.  ఔషధ విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను  ఉల్లంఘించినట్లు తేలడంతో, ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్న మొత్తం 23 మెడికల్ షాపుల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. 
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.