పార్కుల ఎంట్రీ ఫీజు ఇక రెట్టింపు: జీహెచ్ఎంసీ నిర్ణయం.!
Publish Date:Nov 17, 2026
Advertisement
భాగ్యనగర వాసులకు ఆహ్లాదం, వినోదం ఇప్పుడు మోయలేని భారంగా మారనుంది. నిత్యం హడావుడి లైఫ్ నుంచి సాయంత్రాలు ఒకింత సేదదీరుదామని పార్కులకు వెడదామనుకునే మధ్య తరగతి వేతన జీవులు, కష్ట జీవులకు ఇక పార్కులలో ప్రవేశం భారంగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులలో ప్రవేశ రుసుము ఇక దాదాపు రెట్టింపు కానుంది. నగరంలోని ప్రముఖ పార్కులను సందర్శించే ప్రజలపై భారం పడేలా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ పార్కుల్లో ప్రవేశ రుసుములన పెంపునకు ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం, పెద్దలకు సంబంధించిన ఎంట్రీ ఫీజును ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.20కి పెంచారు. అంటే ప్రవేశ రుసుం రెట్టింపు కానుంది. అలాగే, 5 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లల టికెట్ ధరను రెండు రూపాయల నుంచి ఐదు రూపాయలకు పెంచింది. ఇక 12 సంవత్సరాలు దాటిన పిల్లలకు, పెద్దలకు ఇకనుంచి ప్రవేశ రుసుముగా 20 రూపాయలు చార్జ్ చేయనున్నారు. లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డులోని ఇందిరా పార్క్, బంజారా హిల్స్‌లోని జలగం వెంగళారావు పార్క్, కృష్ణకాంత్ పార్క్, ఇమ్లీబన్ పార్క్, మాసబ్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్క్, సనత్‌నగర్ కేఎల్ఎన్ యాదవ్ పార్క్ వంటి ప్రధాన పార్కులన్నింటికీ ఈ కొత్త ధరలు వర్తించనున్నాయి. ఈ పార్కుల్లో ఉదయం 8:00 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు టికెట్లు జారీ చేసే ప్రస్తుత సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు. పాత వేళల ప్రకారమే టికెట్ కౌంటర్లు పనిచేస్తాయి. పెద్దల ఎంట్రీ ఫీజు చివరిసారిగా 2017లో రూ.5 నుండి రూ.10కి పెంచారు. అలాగే పిల్లల ఎంట్రీ ఫీజును 2018లో రూపాయి నుంచి రెండు రూపాయలకు పెంచారు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మళ్లీ ధరలను పెంచుతూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా చదవండి: పార్కు కోసం భూమి ఇస్తే.. డేటా సెంటర్ కట్టేసారు! పెరిగిన ధరల వల్ల పార్కుల్లో పచ్చదనం సంరక్షణ, వాకింగ్ ట్రాక్‌లు, లైటింగ్, పారిశుద్ధ్యం మరియు ఇతర మౌలిక వసతుల మెరుగుదలకు అవసరమైన నిధులు సమకూరుతాయని జీహెచ్ఎంసీ చెబుతోంది. అయితే, నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే పబ్లిక్ పార్కుల్లో ప్రవేశ రుసుములను ఒకే సారి రెట్టింపు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. మరి కొందరైతే.. సౌకర్యాల మెరుగుదలకు ఎంట్రీ ఫీజు పెంచడం సరైనదేనని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అత్యధికులు మాత్రం.. సామాన్యుడికి సాయంత్రం వేళ్లలో ఆహ్వాదం కోసం ఉన్న అవకాశాన్ని ప్రియం చేయడం తగదని అంటున్నారు. ఏదేమైనా పార్కుల్లో విహరించే నగర ప్రజలకు మాత్రం ఇకపై అదనపు భారం తప్పదంటున్నారు. పిల్లలతో సాయంత్రం వేళల్లో పార్కుల్లో సరదాగా గడపాలంటే ఇప్పుడిక జేబుపై భారం పడుతుందని ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించిందంటున్నారు. మీకు నచ్చవచ్చు: కృష్ణ కాంత్ పార్కులో ప్రేమ పెళ్లి.. ఆ తర్వాత జరిగింది ఇది.. ఇక ఇల్లు, ఆఫీసు మాత్రమే కాదు.. పార్కుల్లోనూ ఉద్యోగం.. వర్క్ ఫ్రం పార్క్‌కు శ్రీకారం.!
[Parksentryfees, Hyderabadparks, GHMC, ticketprice, Double, TeluguOne]
http://www.teluguone.com/news/content/parksentryfees-24-237284.html




