ట్రాఫిక్ కష్టాలకు చెక్: హైదరాబాద్ లో పాడ్ టాక్సీలు.!
Publish Date:Nov 19, 2026
Advertisement
విశ్వనగరం హైదరాబాద్ ను విశ్వనరకంగా మార్చేస్తున్న ట్రాఫిక్ చిక్కులకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం కనుగొంది. హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు.. ప్రధానంగా ముఖ్యంగా మెట్రో రైలు స్టేషన్ల నుంచి గమ్యస్థానం చేరుకునేందుకు కమ్యమూటర్స్ పడుతున్న ప్రయాణ కష్టాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీఎస్) అదే పాడ్ ట్యాక్సీల వ్యవస్థను తీసుకురావడంపై దృష్టి పెట్టింది. మెట్రో ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో మూడు ప్రధాన మార్గాల్లో రాకపోకలు కొంత మేరకు సులభతరమయ్యాయి. అయితే మెట్రో రైలు దిగి, మెట్రో స్టేషన్ బయటకు వచ్చిన తరువాత తమతమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు, తగిన ప్రజా రవాణా లేకపోవడం, క్యాబ్‌లలో అధిక ఛార్జీల వంటి సమస్యలఎదుర్కొంటున్న అటువంటి వారు సులభంగా గమ్యస్థానం చేరుకునేందుకు వీలుగా ఈ పాడ్ టాక్సీలను తీసుకురావాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర అధ్యయనం అనంతరం ముఖ్యమంత్రి పాడ్ టాక్సీల కోసం మూడు మార్గాలను ఎంపిక చేశారు. డిసెంబరు నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం మెట్రో రైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం కేపీహెచ్‌బీ, బయోడైవర్సిటీ, అలాగే ఎల్బీ స్టేడియం, రాణిగంజ్, ఇంకా అసెంబ్లీ బేగంపేట మార్గాలను ముఖ్యమంత్రి ఖరారు చేశారు. పీఆర్టీఎస్ విధానంలో పాడ్ ట్యాక్సీలు సంచరించేందుకు ఈ మార్గాల్లో ప్రత్యేకంగా ఎలివేటెడ్ ట్రాక్‌లను నిర్మిస్తారు. వాటిపై ఏర్పాటు చేసే గైడ్‌వేలు, ట్రాక్‌లపై ఈ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. వీటికి డ్రైవర్లు ఉండరు. అచ్చం మెట్రో రైళ్లలాగే.. ఇవి కూడా పూర్తిగా స్వయంచాలకంగా, కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థ ద్వారా నడుస్తాయి. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ వ్యవస్థలో వసతులు ఉంటాయి. చిన్న కారు తరహాలో కనిపించే పాడ్ ట్యాక్సీలలో నలుగురు నుంచి ఆరుగురు వరకు ప్రయాణించే వీలుంటుంది. అవసరమైతే ఒకేసారి 15 నుంచి 20 మంది ప్రయాణించేలా గ్రూప్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (జీఆర్టీ) వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ప్రయాణికులు పాడ్ కార్ ఎక్కిన తర్వాత అందులో ఉండే టచ్‌పాడ్ ద్వారా తమ గమ్యస్థానాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. మెట్రో స్టేషన్లు, ప్రధాన రవాణా కేంద్రాల నుంచి సమీపంలోని ఐటీ పార్కులు, ఆఫీసులు, నివాస సముదాయాలకు వేగంగా, సౌకర్యవంతంగా చేరుకోవడానికి ఈ పీఆర్టీఎస్ పీఆర్టీఎస్ సేవలు దోహదం చేస్తాయి. ఇవి బ్యాటరీ ఆధారంగా నడుస్తాయి కాబట్టి వాహన కాలుష్యం ఉండదు. ఈ పాడ్ ట్యాక్సీలు గంటకు 35 నుంచి 44 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన ప్రాంతాల్లో విభిన్నమైన గైడ్‌వేలు, స్టేషన్ల డిజైన్లతో మాత్రమే ఇటువంటి పీఆర్టీఎస్ సేవలు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. భూమిపై నడిచే ట్రాక్‌లతో పాటు గాలిలో కేబుల్స్, పైభాగపు ట్రాక్‌లకు వేలాడుతూ ప్రయాణించే వాహనాలు వంటి ఎనిమిది రకాల సాంకేతికతలు అందుబాటులో ఉన్నప్పటికీ, హైదరాబాద్ లొ ఎలివేటెడ్ ట్రాక్‌ల డిజైన్ వైపు అధికారులు మొగ్గు చూపుతున్నారు. దేశంలో తొలిసారిగా ముంబయిలోని బాంద్రా, కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో 8.5 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ పీఆర్టీ ప్రాజెక్టును చేపట్టారు. అక్కడ అల్ట్రా పీఆర్టీ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్.! లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో ఉపయోగిస్తున్న సాంకేతికత కూడా ఇదే. యూకేకు చెందిన అల్ట్రా పీఆర్టీ సంస్థతో కలిసి హైదరాబాద్‌కు చెందిన సంస్థే ఆ ప్రాజెక్టును చేపట్టడం గమనార్హం. డిసెంబరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంపిక చేసిన మూడు కారిడార్లలో సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిశీలించి అర్హులైన సంస్థలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే రద్దీ మార్గాల్లో రోడ్లపై వాహనాల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మెట్రో ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితంగా గమ్యస్థానాలకు చేరుకునే ప్రత్యామ్నాయం లభిస్తుందనే అంచనాలు నగరవాసుల్లో వ్యక్తమవుతున్నాయి. రానున్న దశల్లో టెండర్లు, నిర్మాణ పనుల పురోగతిపై అందరి దృష్టి నిలవనుంది. 14 ఫ్లైఓవర్లు రద్దు: జూబ్లీహిల్స్ నుండి NFCL వరకు కొత్త సిగ్నల్ ఫ్రీ ప్లాన్! [PRTS, PodTaxis, Hyderabad, MetroConnectivity, KPHB Biodiversity PRTS, TeluguOne]
మీకు నచ్చవచ్చు: ఉప్పల్ స్టేడియం మ్యాచ్ వేళ.. హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు!
http://www.teluguone.com/news/content/prts-24-237458.html




