Publish Date:Feb 28, 2012
యానాం: యానాంలోని రీజెన్సీ సిరామిక్ కార్మికులు పొట్టకూటికోసం వలసలు పోతున్నారు. రీజెన్సీ యాజమాన్యానికి, కార్మికులకు మధ్య వివాద నేపధ్యంలో జనవరి 27న చోటుచేసుకున్న ఘటనలతో రీజెన్సీ సిరమిక్స్ తో పాటు రెగ్నా సిరామిక్స్, రీజెన్సీ బ్లేజెస్ లిమిటెడ్ కంపెనీలకు ఫిబ్రవరి 1న లాకౌట్ ప్రకటించారు. దీంతో 2500 మంది రెగ్యులర్ కార్మికులు, 4000 మంది డైలీ బేస్ కార్మికులు ఉపాధి కోల్పోయారు. లాకౌట్ ప్రకటనతో కార్మికులకు జీతాలు అందడం లేదు. కుటుంబ పోషణార్ధం ఈ కార్మికులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వలసలుపోతున్నారు. కొంతమంది సొంత ఇళ్ళను సైతం ఖాళీచేసి వలస వెళ్లిపోవడంతో అ ఇళ్ళకు తాళాలు పడ్డాయి. వీధులకు వీధులే ఖాళీ అయ్యాయి. జీతాలు లేక అద్దెలు చెల్లించలేక, పొరుగు ప్రాంతాలకు చెందినవారు ఇళ్ళు ఖాళీ చేస్తుండటంతో ఎక్కడ పడితే అక్కడ టూ లెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోపక్క ఈ పరిణామాల ప్రభావం యానాంలోని ఇతర వ్యాపార సంస్థలపై కూడా పడింది. నెలరోజులుగా వ్యాపారాలు లేక ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక వ్యాపారాలు వాపోతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yanam-regency-24-12258.html
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!