Publish Date:Feb 28, 2012
సెలవుపై వెళ్ళిన రామాంజనేయులు
విశాఖపట్నం: విశాఖజిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తనకన్నా జూనియర్ వద్ద తనను పనిచేయమంటున్నారంటూ జివిఎంసి కమీషనర్, ఐఏఎస్ అధికారి అయిన వివాదాస్పద బి.రామాంజనేయులు తీవ్రంగా అలిగి సెలవుపై వెళ్ళిపోయారు. జివిఎంసి పాలకవర్గం పదవీకాలం కొద్ది రోజుల క్రితం ముగిసింది. దీనికి కమీషనర్ గా బి.రామాంజనేయులు ఉన్నారు. పాలకవర్గం పదవీకాలం ముగిసిన తరువాత ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ ను నియమించింది. ఇది రామాంజనేయులుకు ఆగ్రహాన్ని, అసంతృప్తిని కలిగించింది. కలెక్టర్ లవ్ అగర్వాల్ తనకంటే జూనియర్ అధికారి అని ఆయనను తనపై ప్రత్యేక అధికారిగా నియమించడం ఏమాత్రం సమంజసం కాదని, అసలు ఆయన వద్దకు వెళ్ళి తాను ఎలా పనిచేయగాలనని రామాంజనేయులు ప్రశ్నిస్తున్నారు. జివిఎంసిలో ఇప్పటి వరకు స్వతంత్రంగా వ్యవహరించానని, ఇకనుంచి ప్రతి పనికి కలెక్టర్ వద్దకు వెళ్ళాల్సి ఉంటుందన్నారు. పాలకవర్గం పదవీకాలం ముగియడంతో స్పెషలాఫీసర్ గా సీనియర్ అధికారులు శ్యాంబాబు లేదా విజయకుమార్ ను నియమించాలని రామాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విజయకుమార్ ను నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విజయ్ కుమార్ అయిష్టత చూపడంతో జిల్లా కలెక్టర్ కు అవకాశం కలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మనస్తాపానికి గురైన రామాంజనేయులు సెలవు పై వెళ్ళారు. రామాంజనేయులు తీరు లవ్ అగర్వాల్ కు కూడా ఇబ్బందికరంగా మారింది. హుందాగా వ్యవహరించాల్సిన సీనియర్ అధికారి ఇలా చీప్ గా బిహేవ్ చేయడం ఏమిటని లవ్ అగర్వాల్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ విశాఖ నగరాభివృద్ధికి శాపంగా మారే ప్రమాదం ఉందని నగర వాసులు అందోళన చెందుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/visakhapatnam-24-12257.html
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!