త్వరలో వై.ఎస్. హయాంలోని వివాదాస్పద జీవోల రద్దు?

Publish Date:Jun 2, 2012

Advertisement

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో విడుదలైన జీవోలను నిలుపుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. కొత్త జీవోలతో పాత వాటిని రద్దు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. దానిలో భాగంగానే బ్రహ్మణీ స్టీల్స్ తో ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ 99ని విడుదల చేసింది. 2007లో వై.ఎస్. ప్రభుత్వం ఈ ఒప్పందం ప్రకారం 14వేల ఎకరాలను బ్రాహ్మణికి కట్టబెట్టింది. ఈ భూములను కూడా వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ జీవోతో పాటు అంటే 2010లో ఒక జీఓ, 2009లో 14జీవోలు, 2008లో 12జీవోలు, 2007లో 4జీవోలు వై.ఎస్. ప్రభుత్వం విడుదల చేసింది మొత్తం 31పైచిలుకు ఉంటాయని అంచనా. అంటే మరో 31 జీవోలతో వీటిని అడ్డుకునేందుకు కిరణ్ సర్కార్ ప్రయత్నిస్తోంది.



అప్పట్లో విడుదలైన జీవోల వివరాలు ఇలా ఉన్నాయి. 2010లో ఫిబ్రవరి 26న విడుదల చేసిన 12జీవో, 2009 ఫిబ్రవరి 13న విడుదల చేసిన 54వ జీవో. అదేనెలలో మూడోతేదీన విడుదల చేసిన 104జీవో, అదేనెల 26వ తేదీన విడుదల చేసిన 293 జీవో, అదేనెల 19న విడుదల చేసిన  136జీవో, 2009 జనవరి 29న విడుదల చేసిన 25వ జీవో, 2009 ఫిబ్రవరి 26న విడుదల చేసిన 76వ జీవో, 2009జులై 11న విడుదల చేసిన 865 జీవో, అదే ఏడాది ఆగస్టు 12న విడుదల చేసిన 94జీవో, మే 18న విడుదల చేసిన 107జీవో, జులై 31న విడుదల చేసిన 19జీవో, జూన్ 14న విడుదల చేసిన 30జీవో, అదే నెల 24న విడుదల చేసిన 32జీవో, మార్చి 28న విడుదల చేసిన 35జీవో, జులై 7న విడుదల చేసిన 42జీవో వివాదాస్పదమయ్యాయి. 2008లో డిసెంబర్ 4న 1435జీవో, మార్చి 25న 382జీవో, ఆగస్టు 2న 477జీవో, డిసెంబర్ 12న 1490జీవో, మార్చి 29న  91జీవో, జులై 22న విడుదల చేసిన 146జీవో, ఆగస్టు 12న 94జీవో, డిసెంబర్ 8న 321జీవో, సెప్టెంబర్ 15న 1110జీవో, సెప్టెంబర్ 16న 1115జీవో, నవంబర్ 7న 305జీవో, జులై 10న 36జీవో కూడా జగన్ కేసుతో వివాదాస్పదంగా గుర్తింపునందుకున్నాయి. 2007లో ఆగస్టు 2వ తేదీన విడుదల చేసిన  477జీవో, జూన్ 8న విడుదల చేసిన 785జీవో, జూన్ 18మ వాడిద;అ చేసిన 151జీవో, అదే నెల 10న విడుదల చేసిన 152జీవో కూడా అక్రమాస్తుల కేసులో కీలకంయ్యాయి. అందుకే ఈ 31జీవోలను పూర్తిగా చదివి వాటికి వ్యతిరేకంగా ఒకే జీవోను కానీ ప్రత్యామ్నాయంగా మరో 31జీవోలను కానీ విడుదల చేయాలని సిఎం ఉన్నతాదికార్లను ఆదేశించారని తెలుస్తోంది. కొందరు మంత్రులను కూడా ఈ విషయంలో బాధ్యతలు తీసుకోమని ఆయన కోరారని సమాచారం. 

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.