లగడపాటి ల్యాంకోపై ఆస్ట్రేలియాలో 350కోట్ల డాలర్ల నష్టపరిహార దావా

Publish Date:Jun 2, 2012

Advertisement

ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకుకు రూ 3వేల కోట్ల మేర టోపీ పెట్టిన ల్యాంకో రాజగోపాల్ ఆస్ట్రేలియాలోని వివాదాస్పద గనులపై లోన్ తీసుకుని బ్యాంకును మోసగించిన ల్యాంకో ఆస్ట్రేలియాలోని ఒప్పందాలను ఉల్లంఘించి వర్ధమాన్ యూరియా కంపెనీని దివాళా తీయించిన ల్యాంకో వెస్ట్రన్ ఆస్ట్రేలియా కోర్టులో ల్యాంకోపై 350కోట్ల డాలర్ల నష్టపరిహార దావా!



ఖద్దరు బట్టలు ధరించి ఎప్పుడూ ఇతరులకు నీతులు బోధించే లగడపాటి రాజగోపాల్ స్థాపించిన ల్యాంకో గ్రూప్ అక్రమాలకూ ఆలవాలంగా మారింది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా లగడపాటి ఆయన సోదరుడు మధుసూదన్ అనైతిక, అక్రమాలకూ పాల్పడుతూ ఇటు దేశీయ బ్యాంకును అతి విదీషీ కంపెనీలను నట్టేట ముంచుతున్నారు. వీరి ఘనకార్యాలకు తాజాగా మనదేశంలో ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు ఆస్ట్రేలియాలోని గ్రిఫిన్ కోల్ మైన్స్, వర్దిమాన్ ఫెర్టిలైజర్స్ బలైపోయాయి. రాజగోపాల్ వ్యవస్థాపకుడుగా ఉన్న ల్యాంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ గత ఏడాది మే 4వ తేదీన వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెరట నగరానికి సమీపాన దివాళా తీసిన గ్రిఫిన్ కోల్ మైన్స్ ను సుమారు 750 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లకు కొనగోలు చేసింది. ఈ కంపెనీ 350 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల రుణాలను చెల్లించలేక 2011 జనవరి 3వ తేదీన దివాళా పిటిషన్ పెట్టింది. ఇలా దివాళా తీసిన కంపెనీని మే నెలలో ల్యాంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఇక్కడ దాకా అంతా బాగానే ఉండి. గ్రిఫిన్ కోల్ మైన్స్ దివాళా ప్రకటించడానికి ముందు వర్ధమాన్ ఫర్టిలైజర్స్ కంపెనీతో బొగ్గు సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బొగ్గును గ్యాస్ గా మార్చి యూరియాగా మార్చే ప్రపంచంలోనే అతి పెద్ద కర్మాగారాన్ని సుమారు 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో నెలకొల్పాలని వర్దిమాన్ యాజమాన్యం కలలు గన్నది. ఈ కర్మాగారం ఏర్పాటుకు వర్దిమాన్ కంపెనీ యజమాని 42 సంవత్సరాల వికాస్ రాంబాల్ తన సొంతనిథులు సుమారు రెండువందల మిలియన్ డాలర్లు ఈ ప్రాజెక్టుపై ఖర్చు పెట్టారు. మిగిలిన మొత్తాన్ని ఆర్ధికసంస్థల నుంచి నిథులుగా పొందాలనుకున్నారు వికాస్ రాంబాల్. ఈ నిథుల సమీకరణకు ఆయన ప్రయత్నిస్తుండగా ల్యాంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రంగంలోకి దిగింది.



నష్టాలో ఉన్న కంపెనీని కొనుగోలు చేయడంతో పాటు గ్రిఫిన్స్ కోల్ మైన్ అప్పటికే వర్తిమాన్ ఫర్టిలైజర్స్ తో చేసుకున్న బొగ్గు సరఫరా ఒప్పందాన్ని గౌరవించటానికి, కొత్త  గనుల అన్వేషణ, అభివృద్ధికి, పెర్త్ పోర్ట్ అభివృద్ధికి అంగీకరించింది. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం విదేశీ సంస్థలు తమ దేశంలోని గనులను కొనుగోలు చేయాలంటే ఇటువంటి షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది. ల్యాంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కోల్ మైన్స్ ను కొనుగోలు చేసిన తరువాత మాట మార్చింది. గతంలో గ్రిఫిన్ కోల్ మైన్స్ సంస్థ తక్కువ ధరకే బొగ్గు సరఫరాకు వర్దిమాన్ ఫెర్టిలైజర్స్ తో ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పుడు ఆ రేటు పెంచితే తప్ప బొగ్గును సరఫరా చేయబోమని స్పష్టం చేసింది. దీనితో వర్దిమాన్ ఫెర్టిలైజర్స్ సంక్షోభంలో పడింది. బొగ్గు సరఫరా లేకపోవడంతో వర్దిమాన్ ఫెర్టిలైజర్స్ కు రుణాలు ఇవ్వడానికీ బ్యాంకర్లు ముందుకు రాలేదు. దీంతో మొత్తం ప్రాజెక్టు నిలిచిపోయింది. ల్యాంకో అనైతిక, అక్రమ చర్యల కారణంగా తాము అపారంగా నష్టపోయామని దానికి పరిహారంగా తమకు 3.5 మిలియన్ డాలర్ల నష్టపరిహారం (ల్యాంకో కోల్ మైన్స్ ను 750 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ మొత్తానికన్నా ఐదు రెట్లు ఎక్కువ పరిహారం వర్దిమాన్ కోరుతోంది) కోరుతూ వెస్ట్రన్ ఆస్ట్రేలియా కోర్టులో కేసు వేసింది.



ఈ కేసు విచారణలో ఉన్నందున కోల్ మైన్స్ పై ఎటువంటి లావాదేవీలు చేయరాదని కోర్టు ఆదేశించింది. ఇక్కడ నుంచే ల్యాంకో సంస్థ మరో పెద్ద కుంభకోణానికి తెరతీసింది. ఈ కోల్ మైన్స్ పై కోర్టులో వివాదం ఉన్నప్పటికీ ఈ విషయాన్ని మరుగున పరిచి ఈ కోల్ మైన్స్ ను ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకుకు తనఖా పెట్టి మూడువేల కోట్ల రూపాయల రుణాన్ని పొందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వర్దిమాన్ ఫెర్టిలైజర్స్ కంపెనీ కోర్టు ముందు లబోదిబోమంది. ఒకవైపు తాము నష్ట పరిహారం కోసం ప్రయత్నిస్తుండగా మరోవైపు వివాదంలో ఉన్న కోల్ మైన్స్ ను ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకుకు తాకట్టు పెట్టిందని ఒకవేళ తాము ఈ కేసులో గెలిస్తే ల్యాంకో తమకు ఎక్కడ నుంచి డబ్బు తెచ్చి నష్టపరిహారం చెల్లిస్తుందని ప్రశ్నించింది. దీనికి అక్కడి వెస్ట్రన్ ఆస్ట్రేలియా న్యాయశాఖ స్పందిస్తూ ల్యాంకో ఐ.సి.ఐ.సి.ఐ.కు పెట్టిన తాకట్టు చెల్లదని పేర్కొంది. దీంతో ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు ల్యాంకో ఉచ్చులో ఇరుక్కుపోయింది. ఇది ఇలా ఉండగా ల్యాంకో సంస్థ తమతో చేసుకున్న కొనుగోలు ఒప్పందంలోని డెవలప్ మెంట్, ఎక్స్ ప్లోరేషన్ క్లాజ్ లతో పాటు వర్దిమాన్ బొగ్గు సరఫరా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అందువల్ల కోల్ మైన్స్ అమ్మకపు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు గ్రిఫిన్ కోల్ మైన్స్ యాజమాన్యం ప్రకటించింది. ఇదే జరిగితే ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు ఇచ్చిన మూడువేల కోట్ల రుణానికి ముప్పు ఏర్పడినట్లే.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.