విజయసాయి సెకండ్ ఇన్నింగ్స్!

Publish Date:Apr 11, 2026

Advertisement

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు అది నిజమే. అలాగే రాజకీయ సన్యాసం అన్నది కూడా అంత తేలిక కాదు అని విజయసాయి చెప్పకనే చెబుతున్నారు.  తాన రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వ్యవసాయమే వ్యాపకంగా శేష జీవితం గడుపుతానని ప్రకటించిన విజయసాయి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టడానికి రెడీ అయిపోయారు. అయితే ఈ సారి ఆయన పోలిటికల్ అవతారం డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ తో మొదలు కానుంది.

ఔను ఆయన తాను దేశ వ్యాప్తంగా తన గళాన్ని వినిపించడం కోసం, తన అభిప్రాయాల ప్రచారం కోసం ఒక డిజిటల్ మీడియాను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.  తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తన మీడియా సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందన్న విజయసాయి.. తన మీడియా  ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదనీ,  ప్రజల సమస్యలపైనే గళమెత్తుతుందనీ చెబుతున్నారాయన.  రైతులు, మహిళలు, యువత, అణగారిన వర్గాల గొంతుకగా తన మీడియా సంస్థ  నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తుందని చెప్పారు విజయసాయి. 

వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయి.. ఇప్పుడు తన రాజకీయపంధాను ఒకింత మార్చుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భాషా సంస్కారంతో సంబంధం లేకుండా గతంలో  ప్రత్యర్థులపై ఇష్టారీతిగా విమర్శలు చేసిన విజయసాయి.. ఇప్పుడు తాను ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా తటన్థంగా ఉంటానంటుండటమే ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. వాస్తవానికి  తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మీడియా సంస్థలన్నీ ఏదో ఒక రాజకీయ పార్టీకి పరోక్షంగానో, ప్రత్యక్షంగానో మద్దతుగా ఉన్న తరుణంలో తటస్థం అంటూ మీడియా రంగంలోకి అడుగుపెడతానంటున్నారు విజయసాయిరెడ్డి.  ఈ కొత్త నిర్ణయంపై పరిశీలకులు భిన్నరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. జగన్ క్యాంప్ నుంచి బయటకు వచ్చినప్పటికీ విజయసాయిని తెలుగుదేశం కానీ, జనసేన కానీ దగ్గరకు రానీయడం లేదు. వైసీపీపైన ఆ పార్టీలకు ఎంత వ్యతిరేకత ఉందో, అంతకు ఏ మాత్రం తగ్గకుండా విజయసాయి మీద కూడా వ్యతిరేకత ఉంది.  

ఈ నేపథ్యంలో ఆయన మీడియా ద్వారా  బీజేపీకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఇక మరో విషయమేంటంటే.. తెలుగు రాష్ట్రాలలో డిజిటల్ మీడియా రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ మధ్య కొత్తగా విజయసాయి తన మీడియా సంస్థ ద్వారా ఏ మేరకు నిలదొక్కుకుంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆయన వివాదాస్పద రాజకీయ ప్రస్థానం, నేపథ్యమే కారణమంటున్నారు. ఆయన మీడియా సంస్థను ఇటు వైసీపీ, అటు తెలుగుదేశం కూటమి  పార్టీలూ కూడా విశ్వసించే పరిస్థితి ఉండదంటున్నారు.   ఈ పరిస్థితుల్లో విజయసాయి  సెకండ్ ఇన్నింగ్స్‌ ఎలా సాగుతుందన్నది ఆసక్తికరమేనంటున్నారు. 

By
en-us Political News

  
ఇరాన్ నుండి పాకిస్థాన్ మీదుగా భారత్‌కు సహజ వాయువును అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును పది బిలియన్ డాలర్ల వ్యయంతో 2,700 కిలోమీటర్ల పొడవుతో ఈ పైల్ లైన్ చేపట్టాలని భావించారు.
అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో నౌకల రాకపోకలకు ఆటంకాలు కలగడం పట్ల జైశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత రవాణా అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమన్న ఆయన.. దీనిని అడ్డుకోవడం మంచిది కాదన్నారు.
ముకుల్ ఈ స్థాయికి చేరడం వెనుక అతని తండ్రి దలీప్ చౌదరి అలుపెరుగని పోరాటం ఉంది. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాకు చెందిన దలీప్, తన కొడుకును ఎలాగైనా క్రికెటర్‌గా చూడాలని పెళ్లికి ముందే నిశ్చయించుకున్నారు. ఇందుకోసం ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తనకున్న ఒకే ఒక్క ఇంటిని కూడా అమ్మేసి ముకుల్‌ను శిక్షణలో చేర్పించారు.
తమ డబ్బు గురించి అడగడంతో ఒత్తిడి, బెదిరింపులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్సిడెంట్ చేసి చంపిస్తాం అంటూ మంగ్లీ అనుచరులు బెదిరించారని సుబ్బారావు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కెన్యా నుంచి వచ్చిన 24 మంది మహిళలు సాధారణ ప్రయాణికుల్లా విమానం దిగారు. కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవాలనే ఉద్దేశంతో బురఖాలు ధరించి బంగారాన్ని బ్యాగుల్లో దాచారు. అనుమానం రాకుండా నెమ్మదిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి అధికారిక ఆహ్వానం పంపినట్లు సమాచారం.
యుద్ధం సృష్టించిన మానవ విషాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు చెందిన రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, వారి ఛాయాచిత్రాలను తమ వెంట తీసుకువచ్చింది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. 2024-25 కాలంలో 12,18,53,535 లడ్డూలు అమ్ముడవగా, కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే అదనంగా సుమారు 1.76 కోట్ల లడ్డూల విక్రయాలు పెరగడం గమనార్హం.
సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైలు ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి పైగా నమోదవుతోంది. కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ లిస్ట్ కూడా భారీగా ఉంటోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న ఇతర రైళ్లతో పోలిస్తే, సికిందరాబాద్, విశాఖ మార్గంలో నడిచే వందే భారత్ లో ప్రయాణానికే ప్రయాణీకులు మొగ్గు చూపుతున్నారు.
ఐలాపురంలోని సర్వే నంబర్ 101లో సుమారు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత కొంతకాలంగా అక్రమార్కులు పాగా వేసి నివాసాలను, బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 400 గజాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఒక బిల్డర్ ఆరంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న హైడ్రా బృందం, భారీ పోలీసు బందోబస్తు నడుమ ఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలు చేపట్టింది.
ఖాజీపేటలో ఒక విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలవ్వగా, రాజూపాలెం మండలంలో పాత కక్షలు ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ రెండు ఘటనలు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితికి, యువతలో పెరుగుతున్న హింసా ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.
202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి, ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.