సికిందరాబాద్.. విశాఖ వందేభారత్ రైలు.. ప్రయాణీకుల జోరు

Publish Date:Apr 11, 2026

Advertisement

తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న ప్రతిష్టాత్మక సెమీ హైస్పీడ్ రైలు  వందే భారత్ ఎక్స్‌ప్రెస్  అనూహ్య ఆదరణతో దూసుకుపోతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఈ రైలు..  దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ప్రయాణికుల ఆదరణ పొందిన   రైలుగా సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా..  విమాన ప్రయాణానికి మించిన సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

రైల్వే శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం..  సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైలు ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి పైగా నమోదవుతోంది. కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ లిస్ట్ కూడా భారీగా ఉంటోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న ఇతర రైళ్లతో పోలిస్తే, సికిందరాబాద్, విశాఖ మార్గంలో నడిచే వందే భారత్ లో ప్రయాణానికే ప్రయాణీకులు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణీకుల రద్దీ స్థిరంగా ఉంటోంది. ఇక పండుగలు, వారాంతపు సెలవు దినాల్లో సీట్ల కోసం నెలల ముందే బుకింగ్స్ పూర్తవుతున్నాయి.

ఈ రైలు విజయవంతం కావడానికి ప్రధాన కారణం ప్రయాణ సమయం తగ్గడమేనంటున్నారు రైల్వే అధికారులు. గతంలో విశాఖ చేరుకోవడానికి పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టేది, కానీ వందే భారత్  కేవలం 8 గంటల లోపు ప్రయాణీకులను గమ్యస్థానం చేరుస్తోంది. దీనితో పాటు నాణ్యమైన ఆహారం, మెరుగైన భద్రత, సుఖవంతమైన సీటింగ్ వ్యవస్థ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ రైలు సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు.

ప్రయాణికుల నుండి వస్తున్న భారీ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, రైల్వే అధికారులు ఇప్పటికే ఈ మార్గంలో రెండో వందే భారత్ రైలును కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ రెండు రైళ్లు కూడా దాదాపు పూర్తి సామర్థ్యంతో నడుస్తుండటం తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న రవాణా అవసరాలను ప్రతిబింబిస్తోంది. దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై రూట్లలో నడిచే వందే భారత్ రైళ్ల కంటే కూడా సికింద్రాబాద్-వైజాగ్ రూట్‌కే ప్రయాణికులు బ్రహ్మరథం పడుతున్నారు.

భవిష్యత్తులో ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తమౌతోంది.  ముఖ్యంగా బోగీల సంఖ్యను పెంచడం లేదా మరిన్ని స్టాపేజీలు,  సమయపాలన వంటి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నది. రానున్న రోజుల్లో ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల హవా మరింత పెరగనుందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
పెళ్ళి పీటల మీద మురిసిపోయిన వధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది.
విశాఖపట్నం నగరంలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో, స్నేహితులు తనపై దాడి చేశారన్న అవమానభారంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
లోక్‌సభలో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ సైనికుడి ధైర్యసాహసం చైన్ స్నాచర్‌ను పోలీసులకు పట్టించింది.
హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసు కొత్త మలుపు తిరిగింది.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు అయింది
దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మూడు కీలక బిల్లులు లోక్‌సభ ముందుకు రావడంతో ఉత్కంఠ పెరిగింది.
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణను వేసింది
ఒక పార్టీ త‌ర‌ఫున ఎంత మంది స‌భ్యులు మాట్లాడాల‌ని అనుకున్నా అవకాశం ఇస్తానన్న ఆయన ఒక‌వేళ ఒక పార్టీ త‌ర‌ఫున ఒక స‌భ్యుడే ప్రసంగిస్తానంటే.. ఆ స‌భ్యుడికి కావాల్సినంత స‌మ‌యం ఇస్తామ‌న్నారు చెప్పారు. బిల్లుల‌పై 22 గంట‌ల వ‌ర‌కు అవ‌కాశం ఉంటుందని చెప్పారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల గొంతు నొక్కేస్తున్నారంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికార ప‌క్షం ఇలా స‌మ‌యం ఇవ్వ‌డం, సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తాననడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంత్రి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లుపై తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.