విజయవాడ మేయర్ అభ్యర్థులు వంగవీటి, ఏబీవీ: ప్రత్యర్థులే అయినా విలువలకే పెద్దపీట.!

Publish Date:Oct 26, 2026

Advertisement

రాజకీయ రంగంలో ప్రత్యర్థులుగా తలపడే నాయకులు వ్యక్తిగత స్థాయిలో   గౌరవంగా మెసులుకుంటే ఎంత హుందాగా ఉంటుందో ఏబీవీ, వంగవీటి రాధాలు చూపించారు. విజయవాడ మేయర్ అభ్యర్థులుగా పరస్పరం తలబడుతున్న వంగవీటి రాథా, ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచార హోరులో భాగంగా ఒకరినొకరు ఎదురుపడ్డారు. ఆ సందర్భంగా ఇరువురూ ఆప్యాయంగా హత్తుకుని పలకరించుకోవడం ఆరోగ్యకరమైన రాజకీయాలకు ప్రతీకగా నిలిచిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

విజయవాడ పరిధిలోని గుణదల ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో జనసేన తరఫున తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ,  ఇండిపెండెంట్  అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు  ఎదురుపడ్డారు. ఎన్నికల్లోప్రత్యర్థులుగా పోటీ పడుతున్నప్పటికీ, ఆ ఇద్దరు నేతలు ఎలాంటి సంకోచం లేకుండా  చిరునవ్వుతో పలకరించుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకుని పరస్పరం బెస్టాఫ్ లక్ చెప్పుకున్నారు. 

ఇరువురు నేతల ఈ స్నేహపూర్వక  పలకరింపు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలనే కాకుండా ఏబీవీకి మద్దతు ఇస్తున్న పార్టీల క్యాడర్ ను కూడా విస్మయపరిచింది.  సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం, విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణం హీటెక్కి ఉండటం కద్దు. అయితే అందుకు భిన్నంగా వంగవీటి రాధా, ఏబీవీలు స్నేహపూర్వక పలకరింపు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. 

వీరిరువురూ పరస్పరం పలకరించుకుని హత్తుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిరువురూ నెటిజనుల ప్రశంసలు అందుకుంటున్నారు.  ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. రాజకీయ పోరును వ్యక్తిగత శత్రుత్వంగా మార్చుకోకుండా  ఇలా స్నేహపూర్వకంగా మెలగడం ఆరోగ్యకరమైన రాజకీయాలకు ప్రతీకగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  


[Vangaveeti Radha AB Venkateswara Rao Priority Values,  Vijayawada Politics, Election Campaigning, Janasena, Indopendent, Mayor, Candidates, TeluguOne]  

By
en-us Political News

  
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
రీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
  అతి తీవ్ర తుపాను అర్నాబ్ కారణంగా ప్రాణనష్టం సంభవించకుండా రాష్ట్రం బయటపడగలిగిందంటే అందుకు చంద్రబాబు నిరంతరం చేసిన సమీక్షలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం, తుపాను నష్టాన్ని తగ్గించడానికి అమలు చేసిన కార్యాచరణే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.