జగన్ కోటలో దేశం కూటమి హవా: కడపలో చతికిలబడ్డ వైసీపీ.!
Publish Date:Oct 26, 2026
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు పెట్టని కోటలా భావించే కడప జిల్లాలో ఆయన పార్టీ చతికిల బడింది. ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ కోట బీటలు వారింది. స్థానిక ఎన్నికలలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అడ్డా కడపలో తెలుగుదేశం కూటమి స్థానిక సమరంలో అనూహ్య విజయాలు నమోదు చేసి వైసీపీపై పైచేయి సాధించింది. కడప మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ మున్సిపాలిటీలలో కూటమి అభ్యర్థుల సత్తా చాటారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలలో వైఎసీపీ కేడర్ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా కడపజిల్లాలోని ఆరు మున్సిపాలిటీలను అధికార ఎన్డీయే కూటమి ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడమే జిల్లాపై వైసీపీ పట్టు, జగన్ పట్టు సడలిందనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనూ తెలుగుదేశం సత్తా చాటింది. పులివెందుల మునిసిపాలిటిలోని మొత్తం 40 వార్డులకు గాను 20 వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 66 డివిజన్లలో ఏకంగా 50 డివిజన్లు తెలుగుదేశం కూటమి పక్షాన ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని మొత్తం 52 వార్డులనూ తెలుగుదేశం ఏకగ్రీవంగా గెలుచుకుంది. చైర్‌పర్సన్ స్థానం కూడా దక్కించుకుంది. అదే విధంగా బద్వేలు, కమలాపురం, ఎర్రగుంట, మైదుకూరు, రాజంపేట మున్సిపాలిటీలలో కూడా తెలుగుదేశం కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. కొన్ని చోట్ల చైర్‌పర్సన్ పదవులు కూడా ఏకగ్రీవమవడం కడప కోటలో వైసీపీ కుదేలయ్యిందనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జమ్మలమడుగు, పులివెందుల చైర్‌పర్సన్ స్థానాలతో పాటు కడప కార్పొరేషన్ మేయర్ స్థానానికి మాత్రమే పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ల దాఖలు సమయంలోనే వైసీపీ నాయకులు క్యాడర్ చేతులెత్తేయడం ఆ పార్టీ పరిస్థితి జిల్లాలో ఎంత దయనీయంగా మారితో కళ్లకు కడుతోంది. [Jagan Lost Grip On Kadapa, Kadapa Local Body Elections, YCP setback Kadapa, TDP Allience Victory AP Municipalities, Telugu Desam Party, Telugu One]
http://www.teluguone.com/news/content/jagan-lost-grip-on-kadapa-43-235432.html





