ఏపీలో రెండు రోజుల ముందుగానే సామాజిక పెన్షన్లపంపిణీ: కారణమేంటంటే?
Publish Date:Oct 26, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పెన్షన్ల పంపిణీని రెండు రోజుల ముందుగానే అందించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. నెల నెలా 1వ తేదీన అందజేసే ఈ పెన్షన్లను ముందుగానే అందించాలన్న నిర్ణయానికి స్థానిక ఎన్నికలు కారణం. నవంబర్ 1న అందించాల్సిన పెన్షన్లను అక్బోబర్ 30 నుంచే అందజేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు. ప్రభుత్వ నిర్ణయంతో పెన్షన్దారులకు షెడ్యూల్ కంటే ముందుగానే పెన్షన్ అందనుంది. స్థానిక న్నికల విధుల కారణంగా మార్పుచేశారు. రాష్ట్రంలో నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, నవంబర్ 3న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ సిబ్బంది, స్థానిక యంత్రాంగం నిమగ్నమై ఉంటారు. దీంతో నవంబర్ 1న సామాజిక పెన్షన్ల పంపిణీ సాధ్యమయ్యే పరిస్థితి లేదు. సో.. ఎన్నికల సాకు చెప్పి పెన్షన్ల పంపిణీని జాప్యం చేయడం కంటే ముందస్తుగానే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును అందిస్తారు. ఎన్నికల సమయంలో ఇదే సిబ్బంది ఇతర విధుల్లో నిమగ్నమయ్యే అవకాశం ఉండటంతో పంపిణీ తేదీని ముందుకు మార్చినట్లు చెబుతున్నారు. [AP Pensions Two Days Before, NTR Bharosa Pensions, Pension Disbursement Date, October 30, AP Local Body Eections,Telugu One]
http://www.teluguone.com/news/content/ap-pensions-two-days-before-43-235468.html





