వల్లభనేని వంశీపై త్వరలో వేటు?
Publish Date:May 24, 2012
Advertisement
విజయవాడ తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోపాన్ని చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. వంశీ పేరు కృష్ణాజిల్లాను శాసించే సిండికేట్ల జాబితాలో 9వదిగా నమోదైందన్న సమాచారం బాబుకు ఆగ్రహాన్ని తెప్పించిందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. త్వరలో వంశీని పార్టీనుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణాజిల్లాలో మొత్తం 41షాపులు సిండికేట్ పాలనలో నడుస్తున్నాయి. అయితే అధికారులతో కుమ్ముక్కయి మొత్తం వ్యవహారం నడుపుతున్నది మాత్రం 23మందే. వారిలో వంశీ ఒకరు కావటం ఇతర పార్టీలు (ప్రత్యేకించి కాంగ్రెస్ కు) విమర్శించటానికి అనుకూలంగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. తమలానే చంద్రబాబు కూడా స్పందించి ముందుగానే వంశీపై చర్య తీసుకుంటే అది వ్యక్తిగతమవు తుందని వారు అభిప్రాయపడుతున్నారు. లేదంటే చంద్రబాబు సిండికేట్లను ప్రోత్సహించినట్లు అవుతుందని కూడా పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గ్రూపులో ఉన్న వంశీపై చర్య తీసుకుంటే నందమూరి కుటుంబం తిరగబడుతుందని చంద్రబాబు గతంలో ఆలోచించారు. కానీ, ఈసారి క్రమశిక్షణాచర్య తీసుకోకపోతే పార్టీపరువు పోతుందని ఆయన భయపడుతున్నారు. అందుకే వంశీపై త్వరలో చంద్రబాబు చర్య తీసుకుంటారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు 'తెలుగువన్.కామ్'కు చెప్పారు.
http://www.teluguone.com/news/content/vallabhaneni-vamshi-to-be-sacked-early-24-14278.html





