ఢిల్లీని తాకిన ఆంద్ర ఉప ఎన్నికల వేడి
Publish Date:May 24, 2012
Advertisement
రాష్ట్రంలోని ఉప ఎన్నికలతో ఢిల్లీ వేడెక్కింది. ఇక్కడ జరుగు తున్న ప్రచారాలు, ఫలితాలెలా ఉన్నాయో అన్న సమీక్షలు, సర్వేలు జాతీయనాయకులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రమే దీనిపై దృష్టి పెట్టిందని అందరూ భావించారు. తీరా పరిస్థితి పరిశీలిస్తే కమ్యూనిస్టులు ఒకవైపు, మరోవైపు సమాజ్ వాదీపార్టీ, ఇంకోవైపు బిజెపి కూడా ఈ ఉప ఎన్నికల ఊసులతో కాలక్షేపం చేస్తున్నాయి. ఆ పార్టీల నేతలు తమకు అనుబంధంగా రాష్ట్రంలో ఉన్న నేతల ఇళ్ళకు, సెల్ ఫోన్లకు ఫోన్లు చేసి 'కైసే చల్తారే ... ఇస్ బార్ కౌన్ జీతేగా ... (ఎన్నికలెలా జరుగుతాయి, ఈసారి ఎవరు నెగ్గుతారు) వంటి ప్రశ్నలతో పలకరిస్తున్నారు. దీంతో తమకు తెలిసిన సమాచారం అంతా చెప్పేసి సాయంత్రం తామే ఫోను చేస్తామని ఆ నేతలకు భరోసా ఇచ్చేసి రాష్ట్రనాయకులు నియోజకవర్గాలకు వచ్చేస్తున్నారు. స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తరువాత పరిస్థితిని తమ అంచనాలను జోడించి చెబుతున్నారు. బిజెపి నాయకులైతే వెంకయ్యనాయుడు ద్వారా ఈ ఎన్నికల్లో చేయాల్సిన ప్రచారం గురించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రత్యేకించి బిజెపి పరకాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఇక్కడి నుంచి డాక్టరు విజయ్ చందర్ ను అభ్యర్థిగా నిలిపింది. ఇక్కడ గెలుపుకోసం కేంద్రమాజీమంత్రి బండారు దత్తాత్రేయను, వెంకయ్యనాయుడును, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని బాధ్యులుగా ప్రకటించింది. దీనికి తోడు ప్రచారం కోసం సుష్మాస్వరాజ్ ను ఇక్కడికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలానే సిపిఎం నుంచి సీతారామ్ ఏచూరి కూడా ప్రచారంలో పాల్గొనేందుకు రావచ్చని తెలుస్తోంది. ఇంకా అధికారికంగా సమాచారం రాకపోయినప్పటికీ తిరుపతి, అననతపురం జిల్లాలో పార్టీ పోటీలో ఉంది కాబట్టి అక్కడ ప్రచారం చేసేందుకు ఆయన రావచ్చని భావిస్తున్నారు. ఇక ఢిల్లీ లోని కాంగ్రెస్ భవన్ నేతలతో కళకళలాడుతోంది. రాష్ట్రంలో పర్యటిస్తున్న ఎఐసిసి పరిశీలకుడు, రాష్ట్ర ఉప ఎన్నికల ఇన్ ఛార్జి వాయలార్ రవి సమీక్షలను కథలు కథలుగా పార్టీ కార్యాలయంలో చెప్పుకుంటున్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు కెబి కృష్ణమూర్తి కూడా ఢిల్లీ వెళ్ళి నేతలకు తన నివేదికను సమర్పించారు. దీని గురించి కూడా ఇతర రాష్ట్రాల నేతలు ఆసక్తి చూపుతున్నారు. అన్ని పార్టీల జాతీయ నేతలు మాత్రం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి అరెస్టు అవుతారా? లేదా? సర్వేల ప్రకారం జగన్ గ్లుస్తాడా? అన్న అంశాలపై చర్చిస్తున్నారు. గతంలో అన్నాహజారే దీక్ష గురించి చర్చించనినట్టే ప్రతీపార్టీ కార్యాలయంలోనూ జగన్ అంశంపై నేతలు విభేదిస్తున్నారు. ఒక్కూక్కరూ విభిన్న సమాధానాలతో నేతలు చర్చకు వేదికలను రూపొందిస్తున్నారు , ఏదేమైనా దేశారాజదానిని రాష్ట్ర ఎన్నికల వేడి తాకింది. అన్ని కార్యాలయాల్లో టీవీలకు పనిపెట్టారు. వచ్చే ప్రతివార్తనూ పరిశీలించటం, సమీక్షించటం ప్రధానకేంద్రాల పనిలా కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/by-election-in-ap-heat-to-delhi-24-14271.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





