తెలంగాణా ఉద్యమ భవిష్యత్తుకు పరీక్ష కాబోతున్న పరకాల
Publish Date:May 24, 2012
Advertisement
తెలంగాణాలోని 118 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క పరకాలలో మాత్రమే త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పరకాల ఉప ఎన్నికలు తెలంగాణలో ఉన్న పార్టీలన్నింటికీ ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ స్థానంలో గెలుపుకోసం అన్ని పార్టీలు తమ శక్తులను ఒడ్డేందుకు సిద్ధపడ్డాయి. దీనికి తోడు తెలంగాణా వాదానికి ఈ ఉప ఎన్నిక ఓ పరీక్షగా నిలువనుంది. ఈ ఒక్క వాదంపైనే ఆధారపడి బిజెపి, టి.ఆర్.ఎస్., వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడుతున్నాయి. బిజెపి అభ్యర్థిగా డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, టి.ఆర్.ఎస్. అభ్యర్థిగా భిక్షపతి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ముందునుంచి ప్రచారంలో ఉన్నది మాత్రం తాజామాజీ కొండా సురేఖ ఒక్కరే. తెలంగాణా కోసమే తాను రాజీనామా చేశానని కొండా సురేఖ చెప్పుకొస్తున్నారు. అదంతా కాదు తాము తొలుత జాతేయస్థాయిలో తీర్మానం చేశాం కాబట్టి తమను కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణా ఇచ్చేస్తామని భారతీయజనతాపార్టీ ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పలురకాల ప్రణాళికలతో ప్రచార కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. తమ నాయకురాలు సుష్మాస్వరాజ్ ను, ప్రకాష్ జవదేవ్ కర్. స్మృతి ఇరానీ ద్వారా నియోజకవర్గంలో ప్రచారం చేయించాలని నిర్ణయించుకున్నారు. మరో పాలమూరులా ఇక్కడా విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది. అలానే తమ అభ్యర్థి భిక్షపతి భారీ మెజార్టీతో గెలుస్తారని టి.ఆర్.ఎస్. నేతలు ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున చల్లా ధర్మారెడ్డి పోటీలో ఉన్నారు. ఈయన తరపున తెలుగుదేశం తెలంగాణానేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సాంబారి సమ్మారావు విషయానికి వస్తే ఆయన తరుపున సిఎం. పీసీసీ చీఫ్ బోత్సా,, ఇంకా స్థానిక మంత్రులు, నేతలు ఒకటే హడావుడిగా ప్రచారం చేస్తున్నారు. వీరందరి కృషి ఫలితంగా తాను గెలుపొందే అవకాశాలున్నాయని సమ్మారావు ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గం ఫలితాలు తెలంగాణా ఉద్యమం భవిష్యత్తుపై ప్రభావితం చూపే అవకాశం ఉండి. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే టి.ఆర్.ఎస్. కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
http://www.teluguone.com/news/content/future-of-telengana-agitation-in-parakala-election-24-14279.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





