అందుకేనా తెరాస మళ్ళీ కేంద్రంతో కటీఫ్?

Publish Date:Jul 17, 2015

Advertisement

 

ఆ మధ్యన కేసీఆర్ కుమార్తె (నిజామాబాద్ యంపీ) కవిత ప్రధాని మోడీతో కలిసి సెల్ఫీ తీయించుకొని తమ పార్టీ మోడీ ప్రభుత్వంతో చాలా సన్నిహితంగా మెలుగుతోందనే సంకేతాలు పంపారు. అంతకు ముందు “మోడీలేదు...గీడీలేదు...” అని అన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హటాత్తుగా తన వైఖరిని మార్చుకొని ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని హడావుడిగా మొదలుపెట్టేసారు. తన కుమార్తె కవితకు కేంద్రమంత్రిగా చేసేందుకే ఆయన తన వైఖరి మార్చుకొన్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. వారి ఆరోపణలు కేవలం ఊహాగానాలని మొదట కొట్టిపారేసిన కవిత, మళ్ళీ కొన్ని రోజుల తరువాత “మోడీ ఆహ్వానిస్తే కేంద్రంలో మంత్రిగా చేరేందుకు తాను సిద్దమే”నని ప్రకటించడంతో వారి ఆరోపణలు, అనుమానాలు నిజమేనని ద్రువీకరించినట్లయింది.

 

మోడీ ప్రభుత్వం నేటికీ నిలకడగానే వ్యవహరిస్తోంది కానీ తెరాస నేతల వైఖరి మాత్రం మళ్ళీ అకస్మాత్తుగా మారిపోయింది. బహుశః కవితకు కేంద్రమంత్రి మంత్రి ఇవ్వకపోవడం వలననే వారు తమ వైఖరి మార్చుకొన్నారేమో తెలియదు కానీ, ఇంతకు ముందు మోడీతో కలిసి సెల్ఫీ తీయించుకొన్న కవిత కూడా ఇప్పుడు ఆయనపై నిప్పులు కక్కుతున్నారు. మోడీ ప్రభుత్వం మొదటి నుండి కూడా తెలంగాణా పట్ల వ్యతిరేకత, సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని కానీ ఆంధ్రా పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ఏడాది గడిచినా ఇంకా హైకోర్టు విభజించకపోవడం, పుష్కరాలలో తెలంగాణా కంటే ఆంధ్రాకు ఎక్కువగా నిధులు కేటాయించడం, తమ అనుమతి తీసుకోకుండా బేగంపేట విమానాశ్రయాన్ని ఆర్మీకి అప్పజెప్పాలని నిర్ణయించుకోవడం వంటి అనేక కారణాలు ఆమె చూపుతున్నారు. ఆమె కేంద్రంపై నేరుగా విరుచుకుపడటంచూస్తే, బహుశః అందుకే మొన్న డిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ దుమ్మ కొట్టి ఉంటారని అనుమానించవలసి వస్తుంది.

 

కానీ హైకోర్టు విభజనలో ఉన్న న్యాయపరమయిన అంశాల గురించి తెలిసి కూడా ఆమె కేంద్రాన్ని తప్పుపట్టడం అనుచితమేనని చెప్పకతప్పదు. ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు నిర్మించుకొనే వరకు హైదరాబాద్ లో ఉన్న హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబోతున్న రాజధాని అమరావతి నగరంలో హైకోర్టుని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొంది. రాజధాని నిర్మాణం మొదలయ్యి అందులో హైకోర్టుకి శాశ్విత భవనాలు, ఇతర సౌకర్యాలు అన్నీ కల్పించే వరకు ఉమ్మడికోర్టు కొనసాగక తప్పదని స్వయంగా హైకోర్టు ధర్మాసనమే స్పష్టం చేసింది. అంతవరకు ఎవరూ ఆందోళనలు చేయడానికి వీలులేదని, చేస్తే చట్ట ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవలసి వస్తుందని కూడా హెచ్చరించింది.

 

కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాంకేతిక అవరోధం గమనించిన తరువాతనే తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయలేకపోయింది. లేకుంటే మూడు నెలల్లోనే తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేస్తామని న్యాయశాఖామంత్రి సదానంద గౌడ ఇదివరకే ప్రకటించారు. ఇవన్నీ తెరాస ఎంపీ కవితకు తెలియవని భావించలేము. కానీ తెలియనట్లు ఆమె మోడీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అంటే ఆమె అక్కసుకి వేరే ఇతర కారణాలున్నాయని అనుమానించవలసి వస్తుంది. ఆమెకు కేంద్రమంత్రి ఇవ్వకపోవడం, ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, సెక్షన్: 8 అమలు తదితర అంశాలలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం చెంది ఉండటం అందుకు ప్రధాన కారణాలు కావచ్చును.

 

కానీ ఎన్డీయే కూటమిలో భాగస్వామి కూడా కాని తెరాస, కేంద్రమంత్రి పదవిని ఏవిధంగా ఆశిస్తోందో తెలియదు. ఒకవేళ ప్రధాని మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించాలనుకొంటే అందులో మొట్టమొదట తన పార్టీకి చెందిన నేతలకు, ఆ తరువాత ఎన్డీయే కూటమిలో భాగస్వామి పక్షాలకు కేంద్రమంత్రి పదవులు ఇచ్చుకొంటారే కానీ తెరాసని, కేసేఆర్ ని మంచి చేసుకోవడానికి కవితకు కేంద్రమంత్రి పదవి కట్టబెడతారని అనుకోవడం అత్యాశే. అయినా మోడీతో సెల్ఫీలు తీసుకొన్నంత మాత్రాన్న కేంద్రమంత్రి పదవి ఆశించేయడమేనా? కొన్ని రోజులు కేంద్రంతో సన్నిహితంగా మెలగడం, మళ్ళీ మరికొన్నాళ్ళు కత్తులు దూస్తూ తెరాస ప్రభుత్వం నిలకడలేని వ్యవహారశైలి ప్రదర్శిస్తోంది. దాని వలన తెలంగాణా రాష్ట్రానికి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. కేంద్రంపై ప్రస్తుతం కవిత చేస్తున్న ఆరోపణలు చూస్తే ఆ సంగతి అర్ధమవుతుంది.

By
en-us Political News

  
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.