జై కొట్టినా, నో చెప్పినా పదవులకు గండమే.. జగన్ కింకర్తవ్యం.!

Publish Date:Jul 18, 2026

Advertisement

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టసభల్లో నేరస్తుల సంఖ్యను తగ్గించేందుకు, రాజకీయాల్లో పారదర్శకతను పెంచేందుకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. చట్టసభల ప్రతినిధులు ఎవరైనా సరే ఏవైనా కేసులలో 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవిస్తే లేదా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంటే వారి పదవి తక్షణమే రద్దయ్యేలా  ప్రతిపాదనai సిద్ధం చేస్తోంది.  ఈ కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుపై  దేశవ్యాప్తంగా మెజారిటీ రాజకీయ పక్షాలు  సానుకూలంగా ఉన్నప్పటికీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ కొత్త చట్టంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించనున్న ఈ అనర్హత బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని..  అవసరమైతే పార్లమెంట్‌లో వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ ఎంపీలకు జగన్ దిశా నిర్దేశం చేసినట్లు వైసీపీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వారి నుంచి మొదలుకొని సాధారణ శాసనసభ్యుడి వరకు ఎవరైనా సరే ఒక నెల రోజుల పాటు జైలులో గడపాల్సి వస్తే వారి పదవి ఊడిపోయేలా కేంద్రం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని యోచిస్తోంది. అయితే ఈ నిబంధన ప్రకారం జైలు నుంచి విడుదలైన తర్వాత సదరు నాయకులు తిరిగి తమ పదవులను పొందేందుకు వీలుంటుందని కూడా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు. గతంలో పార్లమెంట్‌లో తగినంత బలం లేకపోవడం వల్ల ఈ బిల్లు విషయంలో ముందడుగు వేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ సాహసించలేదు. అయితే ఇప్పుడు  కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటులో తగినంత  సంఖ్యా బలం ఉండటంతో, ఈ బిల్లును తీసుకురావాలని మోడీ సర్కార్ భావిస్తున్నదని అంటున్నారు. 

ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎన్నో వివాదాస్పద బిల్లులకు, కీలక చట్టాలకు వైసీపీ బేషరతుగా మద్దతు ఇస్తూ వచ్చింది. ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామి కాకపోయినప్పటికీ, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల అంటూ  మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు జగన్ జై కొట్టారు. అలాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా కేంద్రం తెస్తున్న ఈ అనర్హత బిల్లును వైసీపీ వ్యతిరేకించాలని నిర్ణయించుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  వైసీపీ తీసుకున్న ఈ యూటర్న్ వెనుక ఆ పార్టీ అగ్రనాయకత్వానికి ఉన్న వ్యక్తిగత, రాజకీయ భయాలే ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దాఖలు చేసిన అక్రమ ఆస్తుల కేసులు విచారణలు ప్రస్తుతం న్యాయస్థానాలలో తుది  దశకు చేరుకున్నాయి. గతంలో ఈ కేసుల దర్యాప్తు నేపథ్యంలో జగన్ దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. దీనికి తోడు..  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన వివిధ రకాల అక్రమాలు, అవినీతి ఆరోపణలపై విచారణలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జగన్ లేదా,  అత్యంత సన్నిహితులైన నేతలు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఈ 30 రోజుల అనర్హత చట్టం గనుక అమల్లోకి వస్తే, భవిష్యత్తులో జగన్ ఎదుర్కొంటున్న కేసుల కారణంగా ఆయన మళ్లీ ఒక నెల రోజుల పాటు జైలుకు వెళ్లాల్సి వస్తే..  ఆయన శాసనసభ సభ్యత్వంతో పాటు పార్టీ ఉనికి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ తరహా చట్టపరమైన ఇబ్బందుల నుంచి తమ అధినేత,  పార్టీ భవిష్యత్తు  రక్షించుకోవడానికే వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ.  ఒకవేళ దేశంలో అవినీతి రహిత రాజకీయాల కోసం కేంద్రం పట్టుబడితే, ఈ చట్టాన్ని అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీలకు అంత సులువు కాదని అంటున్నారు.  

ఒకవేళ కేంద్ర పెద్దల నుంచి ఒత్తిడి పెరిగితే లేదా రాజకీయ వ్యూహాల్లో మార్పులు జరిగితే, ఓటింగ్ సమయంలో  వైసీపీ కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, రాజకీయాల్లో నైతికతను పెంచేందుకు కేంద్రం తెస్తున్న ఈ ప్రతిపాదనపై వైసీపీ తీసుకున్న ఈ వెనకడుగు వ్యవహారం రానున్న రోజుల్లో మరింత రాజకీయ వేడిని పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ బిల్లు విషయంలో జగన్ పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి చందంగా మారిందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. బిల్లుకు జై కొట్టినా, బిల్లును వ్యతిరేకించినా కూడా జగన్ జైలు, పదవుల గండం ఉందని అంటున్నారు. 

YS Jagan Mohan Reddy, YSRCP BJP Bill, 30 Days Jail Disqualification Bill, 130th Constitutional Amendment, Andhra Pradesh Politics 

By
en-us Political News

  
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.