లా అండ్ ఆర్డర్ పై వైసీపీ వాయిదా తీర్మానమా.. హవ్వ.!
Publish Date:Jul 20, 2026
Advertisement
ఏపీలో శాంతి భద్రతలపై వైసీపీ లోక్ సభలో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టింది. సోమవారం వైసీపీ ఇచ్చిన ఈ వాయిదా తీర్మానాన్ని పట్టించుకున్న నాథుడే లేడనుకోండి అది వేరే సంగతి. దేశంలో సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి.. పార్లమెంటులో శాంతి భద్రతలపై వాయిదా తీర్మానం ఇచ్చారు. వైసీపీ వాయిదా తీర్మానంపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో అసెంబ్లీకి ముఖం చాటేసిన పార్టీ.. వాయిదా తీర్మానం ఇవ్వడమేంటంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. గత ఎన్నికలలో అంటే 2024 ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో విజయం సాధించింది. రాష్ట్రంలో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ కోర్టుకు కూడా వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన అసెంబ్లీకే ముఖం చాటేశారు. ఆయనతో పాటు వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లడం లేదు. అయితే నంబర్ ఉంది కనుక వైసీపీ ఎమ్మెల్సీలను మాత్రం మండలికి పంపిస్తున్నారు జగన్. సొంత రాష్ట్రంలో అసెంబ్లీని బాయ్ కాట్ చేసి తగుదునమ్మా అని పార్లమెంటులో లా అండ్ ఆర్డర్ పై వాయిదా తీర్మానం ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. ఎందుకంటే.. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతల వ్యవహారం పూర్తిగా రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. ఒకవేళ శాంతి భద్రతల విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటే బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వైసీపీ ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి. అయితే.. ఆ పని చేయకుండా.. వైసీపీ పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వడాన్ని ఉట్టికెగరలేనమ్మ సామెతలా ఉందని నెటిజనులు ఎగతాళి చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో ఏం చేయలేక.. జాతీయ స్థాయిలో యాక్టివ్ గా ఉన్నామని చాటుకోవడానికి వైసీపీ వాయిదా తీర్మానం డ్రామా ఆడిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. AP law and order, Parliament Monsoon Session, MP Gurumoorthy, Andhra Pradesh politics
http://www.teluguone.com/news/content/ysrcp-adjournment-motion-45-226568.html




