సంతోష్‌నగర్‌లో కారు ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి..!

Publish Date:Sep 20, 2026

Advertisement

సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డులో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు ఇజాన్ ఉద్దీన్ మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. నిన్న మొహియుద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోష్‌నగర్ ఎక్స్ రోడ్‌లోని స్వీకార్ హోటల్ నుంచి పార్సెల్ తీసుకునేందుకు వెళ్లారు. అదే సమయంలో రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇజాన్ ఉద్దీన్‌  రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ కారు చిన్నారి ఇజాన్ ఉద్దీన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చిన్నారిని స్థానిక షాలిని ఆస్పత్రికి తరలించారు. 

అనంతరం ఓవైసీ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించిన తర్వాత బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారుతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే I.S. సదన్ పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే మజ్లిస్ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీల ఆదేశాల మేరకు యాకుత్‌పురా మజ్లిస్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడారు. 

ప్రమాదానికి కారణమైన కారు నంబర్‌ను పోలీసులు గుర్తించారు. కారు, డ్రైవర్ ఆచూకీని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదన చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు. వాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అలాగే  ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలపై ఎల్లప్పుడూ నిఘా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

 

[ Three-year-old boy dies after being hit by car in Santoshnagar, Santoshnagar IS Sadan X Road, 
Izhan Uddin, Owaisi Hospital, Majlis MLA Jafar Hussain Meraj, Crime news, CM Revanth reddy, CP Sajjnar, DGP C.V. Anand ]

By
en-us Political News

  
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాద ఛాయలను నింపింది.
హైదరాబాద్ ఎర్రగడ్డలోని టిమ్స్ ఆసుపత్రిలో చోరీ ఘటన కలకలం రేపింది.
మర్డర్ కేసులో వైష్ణవి సోదరుడితో పాటు మరో ముగ్గురి పాత్ర..!
మగపిల్లలకు పెళ్లి ముచ్చట లేదు.. టార్గెట్లు ఎలా పూర్తి చేయాలి.. ఆశా వర్కర్ల ఆవేదన..?
రాష్ట్రంలో కనిపిస్తున్న కరవు పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల తలెత్తినవి కావన్నారు.  ఇందుకు పూర్తిగా రేవంత్ సర్కార్  అసమర్థ  విధానాలే కారణమని విమర్శించారు.  కృష్ణా నదీ జలాల నిర్వహణ,  వాటిని వినియోగంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.  
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 23లో ఓ వినియోగదా రురాలు తాగునీటిని ఫ్లోర్‌ క్లీనింగ్‌ కోసం వినియోగిస్తు న్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. దీంతో నిబంధనల మేరకు అధికారులు  ఆమెకు   జరిమానా విధించారు. తాగునీటిని రోడ్లు, ఫ్లోర్‌లు కడగడం వంటి అవసరాలకు వినియోగించడంపై జలమండలి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 స్టేషన్‌ బయట సదరు కానిస్టేబుల్‌ ఓ మహిళను కర్రతో కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తు న్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో కానిస్టేబుల్‌ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతు న్నాయి.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాలా కబ్జాలు, బఫర్ జోన్ ఆక్రమణలు జరిగాయని గతంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంయుక్త సర్వేలో సుమారు 14 గుంటల మేర నాలా ఆక్రమణ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు   రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామైన మెట్టుగడ్డ  విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.   ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ సబావత్ అశోక్‌కు తీవ్రంగా గాయపడ్డాడు.
రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం దేవరయంజాల్ సర్వే నంబర్ 437 పరిధిలో ఉన్న ఆ ఒక్క ఎకరం వ్యవసాయ భూమి విలువ నాటి అఫిడవిట్ లో  50 వేల రూపాయలుగా ఉంది.  
ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టిన తెలంగాణ ఏసీబీ  ఈ కేసులో కేటీఆర్‌ను ఏ 1గా, అరవింద్‌ కుమార్‌ను ఏ 2గా, బీఎల్‌ఎన్‌ రెడ్డీని ఏ 3గా పేర్కొంటూ ఏసీబీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 
మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.