కడపలో మహానాడు.. పట్టు నిలుపుకోవడానికి టీడీపీ స్కెచ్

Publish Date:Mar 19, 2025

Advertisement

కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది . వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికే టీడీపీ పాగా వేసింది. 2024 ఎన్నికలలో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏడింటిని  కైవసం చేసుకున్న కూటమి జగన్‌కు షాక్ ఇచ్చింది. ఇప్పుడదే జిల్లాలో లోకేశ్ కనుసన్నల్లో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

 కడప జిల్లా రాజకీయాలంటే ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. నాటి కాంగ్రెస్ పార్టీ నుంచి నేటి వైసీపీ వరకు… అక్కడంతా ఆ కుటుంబానిదే హవా. అందుకు తగ్గట్టే… గడిచిన పాతికేళ్ళలో ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నామ మాత్రపు సీట్లే దక్కాయి. మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2004లో ఒక్క చోట మాత్రమే గెలిచింది తెలుగుదేశం. 2009లో కూడా అదే పరిస్థితి. 2014లో కూడా రాజంపేటలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచారు.  ఇక 2019కి వచ్చేసరికి మొత్తం పదికి పది సీట్లు దక్కించుకుని వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది వైసీపీ.  కానీ… ఆ తరువాత మాత్రం సీన్‌ మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా తెలుగుదేశం పుంజుకుంది. ఉమ్మడి కడప జిల్లాలోని పది స్థానాలకు గాను ఏడు చోట్ల కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. 

కడప జిల్లాలో టిడిపి ఐదు,  బిజెపి ఒకటి, జనసేన ఒకటి చొప్పున అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నాయి. మొట్ట మొదటిసారిగా జిల్లాలో బిజెపి, జనసేన బోణీ కొట్టాయి. రాష్ట్రంలో అధికారం రావడం ఒక ఎత్తయితే కడప జిల్లాలో సత్తా చాటుకోవడం మరో ఎత్తు అనుకుంటున్నారట తెలుగుదేశం ముఖ్యులు. జగన్ అడ్డాలో ఏకంగా ఏడు ఎమ్మెల్యే సీట్లు కొట్టి సత్తా చాటామని,  ఇక ఈ పట్టు తగ్గకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యారంట. అలా పట్టు నిలుపుకునే క్రమంలోనే ఈసారి తెలుగుదేశం మహానాడును కడపలో  నిర్వహించాలని నిర్ణయించారు. 

 తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా కడపలో మహానాడు నిర్వహించలేదు. దాంతో ఇప్పుడు మొదటిసారిగా కడప జిల్లాలోమహానాడు నిర్వహించడమే  కాకుండా… వైసీపీ అడ్డాలో తమ బలాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారట తెలుగుదేశం పెద్దలు. కడపలో మహానాడు నిర్వహించాలని పార్టీ పొలిట్‌ బ్యూరో నిర్ణయించడం వెనక రీజన్‌ ఇదేనని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. కడప లాంటి ఉమ్మడి జిల్లాలో కూటమి ఏడు సీట్లు గెలవడంతో… స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అదే స్థాయి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్‌రెడ్డికి మంత్రి పదవి దక్కింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్ పదవులు వరించాయి. 

కేడర్లో కూడా జోష్ నింపడానికి  కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా కనీవినీ ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలనుకుంటున్నట్టు సమాచారం. నిర్వహణ కోసం కడప నగరంలోని నాలుగు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా నేతలు అధిష్టానానికి నివేదికలు పంపారట. ఇప్పటికే వైసిపి అడ్డాలో పాగా వేసిన తెలుగుదేశం… మహానాడు నిర్వహణతో తన సత్తా చాటాలని అనుకుంటోందట. అటు వైసిపికి బిగ్ షాక్ ఇవ్వడంతోపాటు కార్యకర్తలకు భరోసా కల్పించాలన్నదే టిడిపి ధ్యేయంగా చెప్పుకుంటున్నారు. 

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.