భోగాపురం క్రెడిట్.. ప్రతి విషయంలోనూ జగన్ కి ఇదే అలవాటైపోయింది.!

Publish Date:Jul 31, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చబోతున్న, ఏపీ అభివృద్ధి విషయంలో గేమ్ చేంజర్ కాబోతున్నభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం (ఆగస్టు 1)న ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.  ఈ నేపథ్యంలో  భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ  ఎయిర్‌పోర్ట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది చంద్రబాబు నాయుడి దార్శనికతాఅసలీ క్రెడిట్ వార్ ఏమిటి?  వంటి అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.  

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయాన్ని డిజైన్ చేస్తున్న సమయంలోనే, ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం భోగాపురంలో ఓ భారీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉండాలని చంద్రబాబు భావించి ఆ మేరకు ప్రతిపాదనలు కూడా ఇచ్చారని అడుసుమిల్లి చెప్పారు.  నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే..  కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు. 

2019 ఎన్నికల ప్రచారంలో  జగన్.. ఉన్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే ఈగలు తోలుకుంటున్నారు, అక్కడకి వెళ్లేవాళ్లే లేరు, ఇక భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ దేనికి?  అంటూ చేసిన విమర్శలను అడుసుమిల్లి అజ్ణానం అంటూ కొట్టి పారేశారు.   గతంలో ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించిన భూ సేకరణపై ఎన్నో అనుమానాలు, వివాదాలు రేకెత్తించారు. కానీ చరిత్రను పరిశీలిస్తే ఒక నిజం స్పష్టంగా కనిపిస్తుందన్న ఆయన..  నాడు సైబర్ టవర్స్ కట్టినప్పుడు, శిల్పారామం కట్టినప్పుడు కూడా అందరూ ఇలాగే ఎగతాళి చేశారు. అక్కడెవడు ఉంటాడు? అంత దూరం ఎవడు వెళ్తాడు? అని ప్రశ్నించారు. కానీ ఈ రోజు హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్‌గా మారిన మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలను చూస్తే... చంద్రబాబు విజన్ ఏమిటో అర్ధమౌతుందన్నారు.  

ముందుచూపుతో వ్యవహరించినవారు ఎప్పుడూ నష్టపోరన్న ఆయన..  శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎలాగైతే తెలంగాణ అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా మారిందో, భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు అతిపెద్ద గ్రోత్ ఇంజిన్‌గా మారబోతోంది. అందులో ఇసుమంతైనా సందేహం అవసరం లేదని అడుసుమిల్లి అన్నారు.  వైజాగ్  నుంచి  40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ, ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే గ్లోబల్ ఇన్వెస్టర్లు,  పారిశ్రామిక దిగ్గజాలు, ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్రకు పోటెత్తడం ఖాయమన్నారు. 

జగన్ హయాంలో  భూసేకరణను తగ్గించడం, ప్రాజెక్టు పనులను రెండేళ్లపాటు పక్కన పెట్టడాన్నీ గుర్తు చేసిన అడుసుమిల్లి,   2024లో జగన్ సర్కార్ పతనమై చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత  భోగాపురం పనులు వేగం పుంజుకున్నాయనీ, ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైందనీ చెప్పారు.  అయితే తగుదునమ్మా అంటూ ఇప్పుడు జగన్ భోగాపురం క్రెడిట్ కోసం ప్రాకులాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయినా  ప్రారంభంలో వ్యతిరేకించడం, తర్వాత విమర్శించడం, చివరకు నిజం తెలుసుకుని  క్రెడిట్ చోరీకి పాకులాడటం జగన్ రాజకీయం అని ఎద్దేవా చేశారు.   ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఈ బృహత్తర ప్రాజెక్ట్ ప్రారంభం కావడం యావత్ రాష్ట్రానికి గర్వకారణం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర గ్లోబల్ మ్యాప్‌లోకి ఎక్కబోతోంది. ఇది నిస్సందేహంగా చంద్రబాబు విజన్ తో రూపుదిద్దుకుని సాకారమైన ప్రాజక్ట్ అని అడుసుమిల్లి ముక్తాయించారు. 

Bhogapuram Airport Launch,  Chandrababu Vision, Jagan Credit Chori Attempts, Uttarandhra Development,   PM Modi Bhogapuram, Telogu One

By
en-us Political News

  
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.