జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు. జగన్ మాటలు, ప్రకటనలు ప్రజలలో పార్టీని చులకన చేస్తున్నాయని ఆవేదన..ప్రభుత్వ వ్యతిరేకతను మించి జగన్ మీద అపనమ్మకం ప్రజలను ప్రభావితం చేస్తుందనే భయం...రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో ఎంత మాత్రం సంతృప్తి లేదని అందరికీ అర్ధమైపోయింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆ నిజం ఒప్పుకొంటున్నారు. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కొంటున్నామన్న నిర్వేదం వారిని ఆవహించి వుంది. పరిస్థితి ఇట్లనే వుంటే రేపటి ఎన్నికలలో నెగ్గుక రావడం దుర్లభం అన్న భయం కూడా వారిని కలత పెడుతున్నది. చాలామంది ఎమ్మెల్యేలు ఈ భయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవడానికి వైసీపీ ఎంత మాత్రం సన్నద్ధం కాలేకపోతున్నది. జిల్లా స్థాయి నాయకులు కొందరు మాత్రమే భవిష్యత్ మీద ఆశతో కొంత చురుకుగా కనిపిస్తున్నారు. కానీ కార్యకర్తలలో ఆ ఉత్సాహం, విశ్వాసం కనిపించడం లేదు. మూడు పార్టీల కూటమి, రెండు ప్రధాన కులాల కలయిక కొనసాగినంత కాలం మనమెట్లా గెలుస్తామనే నిరాశ కార్యకర్తలలో కనిపిస్తున్నది. రాజకీయ చర్చలు ఆ కోణంలోనే కొనసాగుతున్నాయి. పైస్థాయి నాయకులు మాత్రం, జగన్ ధోరణి చూసి బాధ పడిపోతున్నారు. ప్రజలలో వున్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడానికి పార్టీ అధినేతగా జగన్ సరైన రీతిలో స్పందించడం లేదన్నది వారి అభిప్రాయం. గత పాలనలో జరిగిన పొరపాట్లు లేదా మహా పాపాల వల్ల తాము ఓడిపోయామని, మళ్లీ అధికారం వస్తే ఆ పొరపాట్లు జరగకుండా చూసుకుంటామనే విశ్వాసాన్ని ప్రజలలో కలిగించడానికి జగన్ ఎంత మాత్రం ప్రయత్నం చేయడం లేదు.
జమీన్ రైతు సౌజన్యంతో...!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-39-227707.html
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.