అన్నదాతలకు అండగా బొద్దింకలు.!

Publish Date:Jul 30, 2026

Advertisement

 ఇప్పటివరకు సోషల్ మీడియాలో, స్టూడెంట్ ప్రొటెస్ట్‌లలో మాత్రమే వినిపించిన పేరు... కాక్రోచ్  జనతా పార్టీ (సీజేపీ)! ఇప్పుడు ఈ బొద్దింకలు  రైతు సంఘాలతో చేతులు కలిపాయి.  నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి. రైతులు, కాక్రోచ్ ల కలయిక నిస్పందేహంగా కేంద్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తీసుకువస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

 కేంద్రంలోని మోడీ సర్కార్ కు ఇన్నేళ్లలో ఎదురైన నిజమైన, బలమైన సవాళ్లు ఏవైనా ఉన్నాయంటే.. అవి.. గతంలో జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం, తాజాగా నీట్ లీకేజీకి నిరసనగా ఉవ్వెత్తున ఎగసిన కాక్రోచ్ ల ఆందోళన. రెండు సందర్భాలలోనూ కూడా మోడీ సర్కార్ దిగి వచ్చి వారి డిమాండ్లను అంగీకరించాల్సి వచ్చింది.  ఇప్పుడు ఈ రెండు శక్తులూ ఏకతాటిపైకి వచ్చాయి. దీంతో భవిష్యత్ లో వీరి కలయిక మోడీ సర్కార్ ను ఏ స్థాయిలో ఇరుకున పెడుతుందీ అన్న చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. 

జంతర్ మంతర్ వేదికగా సిజెపి నాయకులు, రాకేష్ తికాయత్ సహా 500 మంది రైతులతో  భేటీ అయ్యారు. గురువరాం(జులై 29) జరిగిన ఈ భేటీ..కాక్రోచ్ లు ఉద్యమ బాట వీడలేదనీ. కేవలం విద్యా సమస్యలే కాదు, కర్షకుల సమస్యలపైనా తాము ఉద్యమిస్తామనీ, అన్నదాతలకు అండగా నిలుస్తామని ఈ భేటీ ద్వారా సందేహాలకు అతీతంగా పరోక్షంగా ప్రకటించారు.  విద్యార్థులు, యువత,  రైతులు ఏకతాటిపైకి  వచ్చి ఉద్యమిస్తే.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కేందరంలోని మోడీ సర్కార్ పై ఒత్తిడి కొన్ని రెట్లు ఎక్కువ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

ఇప్పటికే నీట్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ ల ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై   నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలనీ, లేదంటే..  తన ఉద్యమాన్నినెక్స్ట్ లెవెల్ కు తీసుకువెడతామనీ సీజేపీ కేంద్రానికి అల్టిమేటమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అల్టిమేటమ్ ఇచ్చిన రోజువ్యవధిలోనే... కాక్రోచ్ జనతా పార్టీ నేతలు రైతు సంఘాల నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   

Cockroach Janta Party, Rakesh Tikait, NEET Protest Delhi, CJP Farmers Protest, Jantar Mantar Protest, Dharmendra Pradhan, Gen Z Protest India, CJP Foreign Funding Court

By
en-us Political News

  
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.