అమ్మానాన్న‌కు ప్రేమ‌తో..

Publish Date:Mar 30, 2026

Advertisement

త‌ల్లిదండ్రుల‌యందు ద‌య‌లేని పుత్రుండు పుట్ట‌నేమీ వాడు గిట్ట‌నేమి అంటారు. అలాంటి పుత్రుల‌ను స‌మాజం వెలివేయాల్సిందిగా  తెలంగాణ సీఎం  సీఎం రేవంత్ రెడ్డి. త‌ల్లిదండ్రుల‌ను స‌రిగా చూసుకోని ఉద్యోగుల తోక క‌త్తిరించేలా ఒక బిల్లు ప్ర‌వేశ  పెట్టారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు స‌భ్యులు పాట‌లు, క‌థ‌లు, ఇత‌ర‌త్రా మోర‌ల్ స్టోరీస్ చెప్ప‌గా.. వారంద‌రిలోకీ  ఓ ముగ్గురు స‌భ్యులు చెన్నిన‌వి బాగా ఆకట్టుకున్నాయి. వీరంద‌రిలోకీ సీఎం  చెప్పిన మోర‌ల్ స్టోరీస్   హైలెట్ అయ్యాయి. 

అందులో మొద‌టిది అశ్వారావు పేట ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ పాడిన పాట బాగా ఆక‌ట్టుకుంది. త‌ర్వాత మంత్రి కొండా సురేఖ కూడా ఒక ముస్లిం మ‌హిళ దీన గాథ చెప్పి క‌న్నీళ్లు తెప్పించారు. పిల్ల‌లుండీ ఆ మహిళ రోడ్డున ప‌డ్డ విధంపై సురేఖ  త‌న స్వీయ అనుభ‌వాల‌ను వెల్ల‌డించ‌డం సైతం హృద్యంగా అనిపించింది. ఇక సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని చండ్ర‌రాజేశ్వ‌ర‌రావు తాను నిర్వహిస్తున్న అనాథ ఆశ్ర‌మం గురించి చెప్పారు. చివరి గా సీఎం రేవంత్  రెండు నీతి క‌థ‌ల‌ను వివ‌రించారు.

వాటిలో శ్ర‌వ‌ణ‌కుడి క‌థ ఒక‌టి. శ్ర‌వ‌ణ కుమారుడు త‌న అంథ త‌ల్లిదండ్రుల‌ను కావ‌డిలో మోసుకుంటూ వెళ్లి తీర్ధ‌యాత్ర‌లు చేశాడ‌నీ.. ఆ స‌మ‌యంలో ఒక చోట ఆగి ఆయ‌న నీళ్లు ముంచుకుంటుండ‌గా.. ద‌శ‌ర‌థ మ‌హారాజు   వన్య మృగంగా భావించి.. వ‌దిలిన బాణంతో అత‌డి ప్రాణం పోయింద‌నీ.. దీంతో ఆ అంథ త‌ల్లిదండ్రులు ద‌శ‌ర‌థ మ‌హారాజును శ‌పిస్తార‌ని వివ‌రించారు. త‌ల్లిదండ్రుల కోసం శ్ర‌వ‌ణ కుమారుడిలా ప్రాణాలు పోగొట్టుకున్న పిల్ల‌ల్ని బ‌హుశా ఈ కాలంలో చూడ‌లేమ‌న్నారు రేవంత్ రెడ్డి. 

ఇక ఆధునిక కాలానికి వ‌స్తే.. కంప్లీట్ మెన్ రేమండ్స్ అనే నినాదంతో విజ‌య‌ప‌థంలో దూసుకెళ్లిన విజ‌య్ ప‌థ్ సింఘానియా ఉదంతం. సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి. అన్నీ త‌న కొడుకుకు ఇచ్చేశాక‌.. ఆయ‌న రోడ్డుపై ప‌డ్డారనీ.. చివ‌రికి త‌నకు నిలువ నీడ లేక అద్దె కొంప‌లో బ‌త‌కాల్సి వ‌చ్చింద‌నీ అన్నారు.. అంద‌రూ ఉండి అనాథ‌లా సింఘానియా మార్చి 28న మ‌ర‌ణించారన్నారు. త‌న‌లా అన్నీ  పిల్ల‌ల‌కు ఇచ్చేసి దీన స్థితి  కొని తెచ్చుకోవ‌ద్ద‌ని త‌ల్లిదండ్రులంద‌రికీ సూచిస్తూ ఆయ‌న ఏన్ ఇన్  కంప్లీట్ లైఫ్ అనే పుస్త‌కం  రాసిన‌ట్టుగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

ఈ రెండు క‌థ‌ల స్ఫూర్తితో తాము నేడు వృద్ధ త‌ల్లిదండ్రుల కోసం ఒక బిల్లు తెస్తున్నామ‌న్నారు ముఖ్య‌మంత్రి. త‌న‌కు తెలిసిన ఒక ప్ర‌జా ప్ర‌తినిథి తండ్రి క్యాన్స‌ర్ కార‌ణంగా మ‌ర‌ణించార‌నీ.. ఆయ‌న్ను కూడా వారి  పిల్ల‌లు స‌రిగా చూసుకోలేద‌ని అన్నారు సీఎం. గ‌తంలో  ఉమ్మ‌డి కుటుంబాలుండేవి. ఒక‌రు కాకుంటే  మ‌రొక‌రు ఆ త‌ల్లిదండ్రుల ప‌ట్ల బాధ్యతగా ఉండేవారు. కానీ నేటి రోజుల్లో ఉమ్మ‌డి  కుటుంబాలు క‌నుమ‌రుగు కావ‌డంతో పాటు.. కుటుంబ నియంత్ర‌ణ అమ‌ల‌య్యి.. చిన్న  కుటుంబాలుగా త‌యార‌య్యాయి. వాటిలోనూ కొడుకు కూతురు స‌మాన‌మంటారు. కొంద‌రు కొడుకులు చూస్తే త‌ల్లిదండ్రుల‌ను బ‌తికి ఉండ‌గానే  కాటికి  పంపించేస్తున్నారు. మ‌రి కొంద‌రు అనాథాశ్ర‌మాల పాలు చేస్తున్నారు. ఇక కూతుళ్లుంటే వారికి ఎంత ప్రేమ ఉన్నా మెట్టినింటి బాధ్య‌త‌ల‌తో త‌ల్లిదండ్రుల‌ను చూసుకోలేక పోతున్నారు. 

కాబ‌ట్టి వృద్ధ త‌ల్లిదండ్రుల జీవిత చ‌ర‌మాంకం  స‌రిగా ఉండేలా  తామీ బిల్లు తీసుకొచ్చిన‌ట్టు ఎంతో భావోద్వేగంగా చెప్పుకొచ్చారు ముఖ్య‌మంత్రి. అలాగ‌ని ఈ చ‌ట్టంతోనే అన్ని స‌మ‌స్య‌లు తీరిపోతాయ‌ని తాము చెప్ప‌డం లేద‌ని.. కాకుంటే స‌మాజం ప‌ట్ల త‌మ బాధ్య‌త‌గా ఈ బిల్లు తెస్తున్న‌ట్టు చెప్పారు ముఖ్య‌మంత్రి.

By
en-us Political News

  
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.