విమోచనమా? విద్రోహమా? అవతరణమా?

Publish Date:Sep 18, 2015

Advertisement

సెప్టెంబర్ 17, తెలంగాణ చరిత్రలో ఇదో ముఖ్యమైన తేదీ, హైదరాబాద్‌ సంస్ధానం భారత్‌ యూనియన్‌లో కలిసి రోజు, దాదాపు 2వందల ఏళ్లపాటు సాగిన నిజాం నిరంకుశ పాలన అంతరించి, తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు, తెలంగాణ చరిత్రలో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సెప్టెంబర్ 17పై 67ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. కొందరు విమోచనమంటుంటే, మరికొందరు విద్రోహదినమంటున్నారు, ఇవన్నీ ఎందుకు జూన్ 2న తెలంగాణ అవతరణం ఉందిగా అంటున్నారు ఇంకొందరు.అయితే గతంలో ఉద్యమ పార్టీగా ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండుసార్లు సెప్టెంబర్ 17 వచ్చివెళ్లిపోయింది కానీ, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ మాత్రం అలాగే ఉంఢిపోయింది.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు, ఉద్యమ పార్టీగా ఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ నేతలందరూ, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని డిమాండ్ చేసినవాళ్లే, మరి ఇప్పుడు వాళ్లే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు?, ప్రతిపక్షాలు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది?

 

అయితే హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా ఇండియన్ యూనియన్ లో విలీనం చేసుకున్నారని, పైగా శాంతిభద్రతల పేరుతో అప్పటి భారత ప్రభుత్వం... సైనికులతో ముస్లింలపై దాడులు చేయిందని,అందుకు నిరసనగా సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పాటించాలని మజ్లిస్ నేతలు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ కి చిక్కులు తెచ్చిపెట్టింది.తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ముస్లింలను మరింత దగ్గర చేసుకునేందుకు, అవకావం దొరికినప్పుడల్లా నిజాంను పొగుడుతున్న సీఎం కేసీఆర్, విమోచన దినోత్సవాన్ని కూడా పక్కనపెట్టేశారు. అయినా జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉండగా, వేరే ఉత్సవాలు అధికారికంగా ఎందుకంటూ తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు సెప్టెంబర్ 17కి మరో కొత్త భాష్యం చెప్పారు, రాజరిక పాలన అంతమై, ప్రజాస్వామ్య పాలన ఆరంభమైన రోజంటూ టీఆర్ఎస్ లీడర్స్ వ్యాఖ్యానించారు.

 

ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట, అధికారంలో ఉండగా మరో మాట మాట్లాడటం రాజకీయ పార్టీలకు అలవాటే అయినా, ఉద్యమ పార్టీ టీఆర్ఎస్, ప్రజల తరపున పోరాడే ప్రజాసంఘాలు కూడా తమ అభిప్రాయాలను మార్చుకోవడం దురదృష్టకరం. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరిన వాళ్లే ఇవాళ అధికారంలో ఉన్నా, దాన్ని అమలు చేయకపోగా, ఆనాడు టీఆర్ఎస్ తో కలిసి ఆందోళనలు, ధర్నాలు, డిమాండ్లు చేసిన కోదండరాం లాంటి నేతలు కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. తెలంగాణ విమోచన దినోత్సవంపై ఏకాభిప్రాయం కావాలన్న ఆయన, ఎలా స్పందించాలో తెలియక ఇబ్బందిపడ్డారు. కేసీఆర్ పార్టీ స్టాండ్ మార్చేయడంతో, ప్రభుత్వానికి నొప్పి కలగకుండా కోదండరాం మాట్లాడిన తీరును జేఏసీ నేతలే ఆక్షేంపించారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని డిమాండ్ చేసిన కేసీఆర్, ఇప్పుడు అధికారంలో ఉన్నా ఎందుకు నిర్వహించలేదంటూ నిలదీయాల్సిపోయి, ఈ నసుగుడు ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉంటే ఒక మాట, లేకుంటే మరో మాట... ఇది పార్టీలకూ అలవాటేనని, అందుకే కాంగ్రెస్ కూడా ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా డిమాండ్ చేస్తుందని గుర్తుచేస్తున్నారు. అయితే ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్, ఫక్తు రాజకీయ పార్టీగా మారి, అధికారంలోకి వచ్చాక మాత్రం వ్యూహాత్మకంగా పక్కన పెట్టేసిందని అంటున్నారు.

 

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. పోరాటాలతో తెచ్చుకున్న స్వరాష్ట్రం తెలంగాణలో కూడా కనీసం విమోచన దినోత్సవం జరిపే పరిస్థితి లేదా అంటూ వాపోయారు.ఓట్ల రాజకీయం కోసం పాకులాడుతున్న కేసీఆర్...చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని దుమ్మెత్తిపోస్తున్నారు.

By
en-us Political News

  
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.