వరుదు కళ్యాణిపై గ్రీష్మ ప్రమోగం!
Publish Date:Mar 15, 2025

Advertisement
ఏపీ శాసన మండలిలో వైసీపీకి బొత్స లాంటి లీడర్లు ఉన్నా సడన్‌గా లైమ్‌లైట్‌లోకి వచ్చారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి . తొలిసారి శాసనమండలిలో అడుగు పెట్టినా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే విధంగా వైసీపీ వాయిస్ బలంగా వినిపిస్తూ సబ్జెక్ట్ బేస్డ్‌గా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆ లేడీ మెంబర్. ఆమె వాగ్దాటికి బ్రేక్ వేయడానికి మంత్రి లోకేష్ వంటి వారు రంగంలోకి దిగాల్సి వస్తుంది.. ఇప్పుడు టీడీపీ నుంచి మరో యువ మహిళా నేత కావలి గ్రీష్మ మండలికి ఎన్నికయ్యారు.. కల్యాణి దూకుడుని కట్టడి చేయడానికి టీడీపీ గ్రీహ్మను ప్రయోగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
శాసనమండలి చైర్మన్ కూడా వైసీపీకి చెందిన వారే కావడంతో మైకు బాగానే దొరుకుతోంది. దాంతో వైసీపీ ఎమ్మెల్సీల వాయిస్ మండలిలో గట్టిగా వినిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనమండలిలో ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న పేరు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలామంది బలమైన లేడీ లీడర్‌లు ఉన్నారు. అధికారం మనదే కదా అని రెచ్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడి అధికారం కోల్పోయిన తర్వాత దాదాపుగా సైలెంట్ అయిపోయారు.
ఏపీ శాసనమండలిలో ఉన్న వైసీపీ నాయకుల్లో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తప్ప ఆ పార్టీ వాయిస్ వినిపించే నేతలే లేరు. అయితే కళ్యాణి శాసనమండలిలో తన వాడైన మాటలతో అందర్నీ ఆకర్షిస్తున్నారు. శాసనమండలిలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వరుదు కల్యాణి ఓన్లీ సబ్జెక్టుతో మాట్లాడుతున్నారు. వైసీపీ సీనియర్లలా అసభ్యకరమైన బాష వాడట్లేదు. ఆమె ధాటిగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో ఆమెను నిలువరించడానికి లోకేష్, వంగలపూడి అనిత వంటి మంత్రులు రంగంలోకి దిగాల్సి వస్తుంది. సహజంగానే అది కూటమికి ఒక విధంగా ఇబ్బందికరంగా మారుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో శాసనమండలికి కొత్తగా అయిదుగురు కూటమి నుంచి గెలిచి వస్తున్నారు. అందులో టీడీపీ నుంచి ముగ్గురు ఉన్నారు. వారిలో మహిళా నాయకురాలు ఉత్తరాంధ్ర కు చెందిన కావలి గ్రీష్మ ఉన్నారు. మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె అయిన గ్రీష్మ ఇప్పటికే పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా ఫోకస్ అవుతున్నారు. టీడీపీ అధికారంలో లేని సమయంలో వైసీపీపై తనదైన స్టైల్లో విరుచుకుపడుతూ గ్రీష్మ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ క్రమంలో గ్రీష్మకు టీడీపీ ఉమెన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టింది. దీంతో మళ్లీ తెరమీదకు వచ్చిన గ్రీష్మకు ఇంతలోనే ఎమ్మెల్సీ అయ్యారు.
వైసీపీ మీద అలాగే వరుదు కళ్యాణి వంటి మహిళా నేతల మీద గ్రీష్మను ప్రయోగించే వ్యూహంలో కూటమి ఉందని అంటున్నారు. బేసికల్ గా వరుదు కళ్యాణి కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. ఆమె రాజకీయ జీవితం కూడా టీడీపీ నుంచి అక్కడే మొదలైంది. అయితే వైసీపీలో చేరాక విశాఖకు మకాం మార్చి ఉమ్మడి జిల్లాను తన రాజకీయ కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. గ్రీష్మ కొత్త ఎమ్మెల్సీగా రావడంతో సిక్కోలు చెందిన ఇద్దరు ఫైర్ బ్రాండ్ల మధ్య రాజకీయ సమరానికి శాసనమండలి వేదికగా మారబోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది
http://www.teluguone.com/news/content/tdp-fire-brand-in-ap-mandali-39-194424.html












