Publish Date:Mar 15, 2025
వైఎస్ వివేకా హత్య జరిగి శనివారం (మార్చి 15)కి సరిగ్గా ఆరేళ్లు. ఈ ఆరేళ్లలో వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. గొడ్డలి పోటు నుంచి గుండెపోటు దాకా.. నారాసుర రక్త చరిత్ర నుంచి ఇంటి మనుషులే హత్య చేశారనే అనేక మలుపులు తిరిగింది. చివరికి కోర్టులు నిర్ధారించి, తీర్పు వెలువరించలేదు కానీ, వివేకా హత్యకు మోటివ్ ఏమిటో, హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న దాని మీద ప్రజలకు సందేహాలేవీ లేకుండా తెలిసిపోయింది. తేలిపోయింది. అయినా ఇప్పటి వరకూ హంతకులు ఎవరన్నది న్యాయస్థానం తేల్చ లేదు. హంతకులకు శిక్ష పడలేదు. కానీ ఈ కేసులో బాధితులు మాత్రం కఠినాతి కఠినమైన శిక్ష అనుభవిస్తున్నారు.
తన తండ్రిని హత్య చేసిన దోషులకు శిక్ష పడాలంటూ వివేకా కుమార్తు డాక్టర్ సునీత అలుపెరుగని పోరాటం ఇంకా సాగుతూనే ఉంది. వివేకా వర్ధంతి సందర్భంగా సునీత మీడియా ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ముఖ్య సాక్షులు ఒకరి తరువాత ఒకరు మరణించడం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. వివేకా కేసులో నిందుల కంటే బాధితులే ఎక్కవ శిక్ష అనుభవిస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఇప్పటికి స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు ఆంధ్రప్రదేశ్ పరిధిలో లేకపోయినా.. ఇక్కడ ఉన్న సాక్షులను కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానిదేనన్న సునీత.. ఆ బాధ్యత నెరవేర్చడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఆరోపించారు. సాక్ష్యులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంటే.. ఇక బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
గత వైసీపీ ప్రభుత్వం వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుకుందనీ, వీలైతే కేసు దర్యాప్తును అటకెక్కించేందుకు ప్రయత్నించిందనీ చెప్పిన సునీత.. ఆ ప్రయత్నాలను తాను న్యాయపోరాటం ద్వారా అడ్డుకున్నాననీ, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాతైనా న్యాయం జరుగుతుందనుకుంటే.. నిరాశే ఎదురౌతోందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/six-years-to-viveka-murder-case-39-194444.html
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.