Publish Date:Mar 15, 2025
గుంటూరు మేయర్, వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. 2021లో మేయర్‌గా ఎన్నికైన మనోహర్ మరో ఏడాది పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారు. గత నెలలో జరిగిన గుంటూరు నగరపాలక స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆరు స్థానాలకు ఆరు స్థానాలనూ తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లు కైవసం చేసుకున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం భయంతో ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.
వైసీపీ నుంచి కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో వైసీపీకి పరాభవం తప్పలేదు. ఈ నెల 17న స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మనోహర్ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. మరోవైపు గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే మరో ఏడాది పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారంటున్నారు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లు కావటి మనోహర్ నాయుడు ఆరోపిస్తున్నారు. మేయర్‌కు ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ పదవిలో ఉండాల్సిన అవసరం తనకు లేదని.. అందుకే రాజీనామా చేసినట్లు కావటి మనోహర్ నాయుడు అన్నారు.
వాస్తవానికి ఇటీవల జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైంది. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అన్ని స్థానాలలోనూ టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైసీపీ నుంచి కొందరు కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే సోమవారం (మార్చి 17) స్టాండింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయి. అదే జరిగితే అవిశ్వాస తీర్మానం గెలిచి మేయర్ గా కావటి దిగిపోవాల్సి రావడం ఖాయం. దీంతోనే కావటి మేయర్ పదవికి రాజీనామా చేసేశారు.
నిబంధనల ప్రకారం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఆ మేయర్ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని ఉండాలి. ఫిబ్రవరి 17తో మేయర్‌గా మనోహర్ నాయుడు పదవీ కాలం నాలుగేళ్లు పూర్తైంది. దీంతో కూటమి నేతలు సరిగ్గా ఆయన నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి అయిన రోజునే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో 56 మంది కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/guntur-mayor-resign-39-194468.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.