Publish Date:Mar 16, 2025
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు.ఆలాంటి వారి విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తే.. వారిని ప్రశ్నించడం వరకు పరిమితం కావాలని, కానీ, వారి ఇంట్లో ఆడవాళ్లు ఏం తప్పులు చేశారని వారిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని నిలదీశారు. ఈ విషయంపై అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాజీవితంలో ఉన్న తనను విమర్శిస్తే సహిస్తాకానీ. కానీ, తన భార్య, నా బిడ్డ ఏం చేశారని వారిపై అనుచిత వ్యాఖ్యలు అదీ బండ బూతులతో చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు? ఇలాంటి వారు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు. వీరు ఏం జర్నలిస్టులు? ఇది ది ఏం జర్నలిజం?, ఇలాంటి కామెంట్లు చదివినా.. విన్నా అన్నం కూడా తినాలని అనిపించడం లేదన్నారు. భూభారతి పేరుతో తనపై వస్తున్న కామెంట్లు చదివేందుకు కూడా మనస్కరించడం లేదన్నారు. ఇలాంటి వారికి తోలు తీస్తానని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించిన రేవంత్ రెడ్డి, భూభారతి పేరుతో పేదల భూములను వారికే చెందేలా చేస్తున్న తన ప్రయత్నం తప్పా? అని ప్రశ్నించారు.
పెయిడ్ ఆర్టిస్టులతో చేయిస్తున్న ఇలాంటి వీడియోలు అత్యంత దారుణంగా ఉంటున్నాయని సీఎం చెప్పారు. ఇలాంటివి చేయడానికి అసలు మనసు ఎలా వస్తోందని నిలదీశారు. సమస్యలు ఉంటే ఉండొ చ్చునని.. వాటిని హ్యాండిల్ చేయాల్సిన తీరు మాత్రం ఇలా కాదన్నారు. “ఇంతలేసి మాటలు మీ నోటికి ఎలా వస్తున్నాయి. మీరు మనుషులేనా? మీకు భార్య, పిల్లలు లేరా?” అని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి విషపూరిత జర్నలిజంపై చర్చ జరగాలన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జర్నలిస్టుల జాబితా తీసి ఎవరు జర్నలిస్టులో చెప్పాలని జర్నలిస్టు సంఘాలను కోరారు. జర్నలిజం డెఫినిషన్ చెప్పండి, తప్పు చేసిన జర్నలిస్టును మీరే శిక్షించండి, జర్నలిస్టు కాని వారిని క్రిమినల్ గానే చూస్తామనీ, అలాంటి క్రిమినల్స్ కి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెబుతామని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-reddy-fires-on-inappropriate-comments-in-social-media-39-194478.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.