టీవీకే విజయ్ హస్తిన పర్యటన.. సీఎం హోదాలో తొలిసారి

Publish Date:May 27, 2026

Advertisement

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం (మే 27) హస్తినలో పర్యటించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటి సారి.  విజయ్ హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతాయి. విజయ్ ఢిల్లీ పర్యటేన కేవలం ఒక మర్యాదపూర్వకంగా మాత్రమే కాకుండా,  తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా  సాగనుందని సమాచారం

ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో   రాష్ట్ర  అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చిం చే అవకాశం ఉన్నాయని అంటున్నారు.  ముఖ్యంగా  పారిశ్రామిక  రంగ అభివృద్ధి,  సంక్షేమ పథకాలు,   మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి  కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు.   ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో  కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.

 కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలపై నిర్మలాసీతారామన్ తో సీఎం విజయ్ చర్చించే అవకాశం ఉంది.  బుధవారం ( మే 28) ఉదయమే  చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న విజయ్.. వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. ఇదే రోజు రాత్రి ఆయన తిరిగి చెన్నై చేరుకుంటారు.  ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పెద్దలతో జరుపుతున్న తొలి అధికారిక భేటీ కావడంతో, తమిళనాడు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర హక్కుల సాధనలో విజయ్ ఎలాంటి ముద్ర వేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.