రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి.. కాంగ్రెస్ శ్రేణులకు సందీప్ కుమార్ పిలుపు.!

Publish Date:Nov 22, 2026

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు. నేతలంతా ఐకమత్యంతో పనిచేయడం వల్ల 64 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించామని గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. రాష్ట్రంలో కరవు పరిస్థితులను అధిగమిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తగిన సహాయ సహకారాలు అందించడం లేదని విమర్శించారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా.. కరువు పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజల అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ మెజారిటీతో, మరిన్ని స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలు, పనితీరు దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అన్నారు. గతంలో తెలంగాణలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేసిన నేతలు పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంతో పార్టీ శ్రేణులు మరింత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

సోనియాగాంధీ రచించిన 'బిలాంగింగ్' పుస్తకానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత లభించిందని పేర్కొన్నారు. సోనియాగాంధీ చేసిన త్యాగాలు, మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల బలిదానాలు దేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రాజకీయంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా ఐకమత్యంతో పనిచేసి.. రాబోయే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని బి.ఎం. సందీప్ కుమార్ కోరారు.

ఇది కూడ చదవండి: నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రభాస్ మద్దతు: ప్రత్యేక టీ-షర్టులను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి

 

[  Telangana Congress PAC meeting, BM Sandeep Kumar, Rahul Gandhi, Sonia Gandhi, Telangana Congress, Congress Party, AICC, Congress Leadership, 64 Assembly Seats, Telangana Government, Congress Workers, BJP, RSS ]

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో లోతైన సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.
మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని సినీ నటుడు ప్రభాస్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు.
అంతర్జాతీయ దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఇటీవల గణనీయంగా పడిపోవడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల్లో తీవ్ర చర్చ మొదలైంది.
బుల్లితెర ప్రేక్షకులను నవ్వించే జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడంపై ఢిల్లీకి చెందిన చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది.
తాళి కట్టిన 24 గంటల్లోనే బిడ్డకు జన్మ..అసలు కథేంటి.?
సర్వదర్శనానికి 8 గంటల సమయం.!
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.