పెళ్లైన మరుసటి రోజే నవవధువు ప్రసవం..వరుడికి ఊహించని షాక్.!
Publish Date:Nov 22, 2026
Advertisement
పెళ్లంటే ఎన్నో ఆశలు.. కొత్త జీవితంపై మరెన్నో కలలు. నిన్నటి వరకు అపరిచితులుగా ఉన్న ఇద్దరు.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. కానీ ఆ వరుడి జీవితంలో పెళ్లయిన మరుసటి రోజే ఊహించని విషాదం చోటుచేసుకుంది. చేతిలో చేయి వేసుకుని ఏడడుగులు నడిచిన ఆ నవదంపతుల జీవితంలోకి ఓ పసికందు రాకతో పెను కలకలం రేగింది. అయితే ఆ పసికందు అప్పటికే విగతజీవిగా జన్మించడం అందరినీ కలచివేసింది. ఈ ఘటన వెనుక ఉన్న పరిణామాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాలయంకోట్టై సమీపంలోని అరియకుళం ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడికి, తాళయూత్తు ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఇటీవల వివాహం జరిగింది. కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో ఆ యువకుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. కానీ పెళ్లయిన కొన్ని గంటల్లోనే పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. వివాహమైన మరుసటి రోజు ఉదయం నవవధువుకు తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావం మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరోవైపు వరుడి ఇంట్లోని బాత్రూమ్లో మృతశిశువు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏడు నెలల గర్భంతో ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామంతో వరుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తనకు పెళ్లి చేసే సమయంలో వధువు గర్భవతి అన్న విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దాచిపెట్టారని ఆరోపించాడు. ఏడు నెలల గర్భంతో ఉన్న విషయాన్ని ముందే చెప్పకుండా వివాహం జరిపించి తనను మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. వరుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవవధువును విచారిస్తున్నారు. అసలు గర్భధారణ విషయం ఎప్పుడు తెలిసింది? వివాహానికి ముందు ఈ విషయాన్ని ఎందుకు వెల్లడించలేదు? కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవైపు పెళ్లయిన మరుసటి రోజే నవజాత శిశువు మృతి.. మరోవైపు వివాహానికి ముందే గర్భధారణ విషయాన్ని దాచారంటూ వరుడి ఫిర్యాదు.. వెరసి ఈ ఘటన ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. అయితే శిశువు మృతికి అసలు కారణం ఏమిటన్నది పోస్టుమార్టం నివేదికతోనే తేలనుంది. పోలీసుల దర్యాప్తు పూర్తయితేనే ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. మీకు నచ్చవచ్చు: అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్లో నారా లోకేష్ ఫ్యామిలీ సందడి.! మీకు నచ్చవచ్చు: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబంలో నలుగురు మృతి.! [ The bride gave birth the day after the wedding, Tirunelveli Crime News, Pichammal, Venkatesh, Tamil Nadu news,Marriage fraud case]
http://www.teluguone.com/news/content/the-bride-gave-birth-the-day-after-the-wedding-25-237687.html




