TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

ఔను నిజమే.. విజయసాయి రెడ్డిని సజ్జల కొట్టారు.. కన్ ఫర్మ్ చేసిన కోటంరెడ్డి.!

వైసీపీ అంతర్గత వ్యవహారాలు, అగ్రనేతల మధ్య విభేదాలను తెలుగుదేశం నాయకుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కన్ ఫర్మ్ చేశారు. గతంలో వైసిపి ప్లీనరీ సమావేశాల వేదికగా వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి మధ్య జరిగిన గొడవలు వాస్తవమేనంటూ సంచలన విషయాలను వెల్లడించారు. అప్పట్లో వైసీపీలో ఉన్న కోటం రెడ్డి నాడు మంగళగిరిలో జరిగిన ప్లీనరీ సందర్భంగా వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు. తాజాగా మీడియా సమావేశంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి 2022 లో మంగళగిరి వేదికగా జరిగిన వైసీపీ ప్లీనరీలో జరిగిన విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు. ప్లీనరీ సమావేశాల విశ్రాంతి గదిలో సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి చొక్కా పట్టుకుని కొట్టారని చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తనకు విజయసాయిరెడ్డిపై ఎలాంటి ప్రేమా లేదంటూ.. అక్కడ నిజంగా ఏంజరిగిందో ప్రజలకు తెలియాలనే ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నానని పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసిన విషయం పార్టీలోని ఎమ్మెల్యేలందరికీ తెలుసన్న ఆయన.. వైసీపీ అధినేత జగన్ కు కూడా ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసన్నారు. అప్పట్లో విజయసాయి, సజ్జల మధ్య నడిచిన ఆధిపత్య పోరుకు సంబంధించి రానున్న రోజులలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇక వైసిపి నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి పనులపై చేస్తున్న ఆరోపణలను ఎద్దేవా చేస్తూ.. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కూడా జగన్ మోహన్ రెడ్డే అంటూ ఆ క్రెడిట్ ను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యం లేదని సెటైర్లు వేశారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై మాట్లాడుతూ.. అక్టోబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవు తాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి నిధులు తీసుకురావాలన్నసంకల్పంతో ఉన్నారనీ, వైసీపీయులే.. ఆటంకాలు సృష్టిస్తూ అడ్డుపడు తున్నారని విమర్శించారు. విశాఖపట్నం తరహాలోనే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల కేసులోనూ కోర్టు నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. [Kotamreddy Sridhar Reddy confirms vijaya sai allegation, Sajjala Ramakrishna Reddy Beat vijayasai, YCP Plenary Clashes, AP Politics, Telugu One]

Published on: Tue Sep 1, 2026 2:18PM

political-news-img

ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయే..తమిళనాడు సీఎం విజయ్ క్లారిటీ.!

తమిళనాట మిత్రపక్షాలుగా ఉన్న టీవీకే, కాంగ్రెస్ మధ్య విభేదాలకు, సంక్షోభానికీ కారణమైన ప్రధాని అభ్యర్థి వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ వివాదానికి స్వయంగా టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ ముగింపు పలికారు. ఇటీవల ఇండియా టుడే, సీఓటర్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దేశంలో ఒకవేళ ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రిగా ఎవరిని ఎంచుకుంటారనే విషయంలో సర్వే ప్రకారం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తర్వాతి స్థానంలో విజయ్ నిలిచారు. జాతీయ స్థాయి అగ్రనేతలను దాటుకుని విజయ్ కు దేశవ్యాప్తంగా జనం భారీగా మద్దతు ప్రకటించడం పొలిటికల్ సర్కిల్స్ ను విస్మయ పరిచింది. అయితే.. ఈ సర్వే ఫలితాలు వెలువడిన వెంటనే తమిళనాడులో పొత్తులో ఉన్న కాంగ్రెస్, టీవీకే మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రధాని రేసులో విజయ్ ఉన్నారని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆయన పరోక్షంగా సవాల్ చేస్తున్నారన్న ప్రచారం మొలైంది. టీవీకే కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా విజయ్ ను జాతీయ నేతగా ప్రాజెక్ట్ చేస్తూ, భావి ప్రధాని అంటూ డిజిటల్ క్యాంపెయిన్ ఆరంభించారు. దీంతో కాంగ్రెస్, టీవీకేల పొత్తుపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ వివాదానికి తెర దించుతూ విజయ్ ఇండియా కూటమి ప్రదాని అభ్యర్థి రాహుల్ గాంధీయే అన్న స్పష్టత ఇచ్చారు. ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్‌బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు. కాంగ్రెస్ - టీవీకే మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కూటమి పొత్తులు దృఢంగా ఉన్నాయని స్పష్టం చేశారు. [Vijay Clarity on PM Candidate, Tamilnadu Cm Vijay, Rahul Gandhi, TVK Congress Rift, Mood of the Nation Survey, PM Face INDIA Bloc, Telugu One]

Published on: Tue Sep 1, 2026 12:39PM

political-news-img

జగన్ మళ్లీ సీఎం కాలేరా? విశ్లేషకులు చెబుతున్నదేంటి?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు రానున్నాయి. అయితే ముందస్తుగానే రాష్ట్రంలో రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అన్న రేంజ్ లో పొలిటికల్ హీట్ ఉంది. రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై వైసీపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. అయితే.. అదే సమయంలో వైసీపీ ఈ రెండేళ్లలో ఇసుమంతైనా పుంజుకోలేదన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాని, ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించడంపై జన సామాన్యంలో కూడా అసంతృప్తి వెల్లువెత్తుదోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ సీఎంను అవుతానంటూ ధీమాగా ప్రకటనలు గుప్పిస్తున్న జగన్ పొలిటికల్ ఫ్యూచర్ పై రాజకీయ పండితులు, పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు. ప్రస్తుత పాలనలోని కొన్ని అంశాలను తటస్థ వేదికలపై విమర్శించే విశ్లేషకులు సైతం.. రాబోయే ఎన్నికలలో వైపీపీ విజయం సాధించి అధికారంలోకి రావడం సాధ్యమేనా అంటే ఔనని చెప్పలేమంటున్నారు. వైసీపీకి ఏ మాత్రం సానుకూల పరిస్థితి లేదని, వైసీపీ పుంజుకుని జగన్ మళ్లీ సీఎం అవ్వడం సులువు కాదని ఎలాంటి శషబిషలూ లేకుండా చెబుతున్నారు. సాధారణంగా పబ్లిక్ ఒపీనియన్ ను ప్రభావితం చేయడంలో పొలిటికల్ అనలిస్టుల పాత్ర కీలకంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా తటస్థ అనలిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా చూసినా తటస్థ విశ్లేషకులు సైతం వైసీపీ తీరుపై పెదవి విరుస్తున్నారు. వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ ఆ పార్టీ చేసుకున్న సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు లేదా లోపాలను ఎత్తిచూపుతూనే విశ్లేషకులు వైఎస్సార్సీపీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. గతంలో అంటే 2014 నుండి 2019 మధ్యకాలంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకుంటే, నాటి రాజకీయ వాతావరణం వైసీపీకి సానుకూలంగా ఉండేది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ . ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడం, బలమైన మీడియా మద్దతు లభించడం మరియు అప్పటి జాతీయ సమీకరణాలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారాయి. ఆ కాలంలో ప్రతిపక్షంలో ఉన్న తీవ్రమైన దూకుడు, ప్రభుత్వ నిర్ణయాలను నిలదీసే నైతిక బలం జగన్ వైపు స్పష్టంగా కనిపించాయి. అంతేకాకుండా, 2014-2019 మధ్యకాలంలో నాటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మేధావులు, రిటైర్డ్ అధికారులు, తటస్థ విశ్లేషకులు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. ఉదాహరణకు, నాటి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టిన పలువురు ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు మరియు ఇతర రంగాల ప్రముఖులు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని బహిరంగంగానే చెప్పారు. అయితే, 2019 నుండి 2024 వరకు సాగిన ఐదేళ్ల జగన్ పాలన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన అధికారంలో ఉండా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, పాలనా విధానాలు విధానాల కారణంగా ప్రజా వ్యతిరేకత అధికమైంది. అదే 2024 ఎన్నికలలో ప్రభుత్వ పతనానికి కారణమైంది. అన్నిటికీ మించి మూడు రాజధానులు, బాబాయ్ గొడ్డలి పోటు, మద్యం కుంభకోణం వంటి అంశాలు జగన్ క్రెడిబులిటీని కోలుకోలేనంతగా దెబ్బతీశాయి. ఆ తరువాత అధికారం కోల్పోయిన తరువాత జగన్ ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితం కావడం, వారానికోసారి చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చినా తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశాలతో సరిపెట్టేయడం వంటివి పార్టీ శ్రేణులలో నిరుత్సాహానికి కారణమయ్యాయి. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు నామమాత్రమయ్యాయి. అన్నిటికీ మించి అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి పుంజుకోవడానికి కావలసిన రాజకీయ వ్యూహాలు, ప్రజా విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నాలు జగన్ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ జరగలేదు. దీంతో పార్టీ ఇమేజ్ రోజురోజుకూ మసకబారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాలను విమర్శించే మేధావులు కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. Can Jagan Become CM Again, AP politics, YS Jagan Mohan Reddy, YCPs Future, AP elections, Telugu One

Published on: Mon Aug 31, 2026 4:39PM

political-news-img

కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ సాఫ్ట్ కార్నర్?

తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి కాలంలో పెను సంచలనం సృష్టించిన కొండా సురేఖ ఎపిసోడ్ కు లాజికల్ కంక్లూజన్ దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తున్నది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించారనే ఆరోపణలపై కొండా సురేఖపై చర్యలకు సిఫారసు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. అయితే రక్షాబంధన్ రోజున కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అప్పాయింట్ మెంట్ తీసుకుని మరీ ఆయనతో భేటీ అవ్వడం, రాఖీ కట్టడం తెలిసిందే. ఆ తరువాత రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించిన ఆమె.. తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు ఎటువంటి సంబంధం లేదని క్లియర్ కట్ గా, క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే కొండా సురేఖపై వేటు విషయంలో పార్టీ హైకమాండ్ వైఖరి మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు ఆమెపై చర్య తీసుకోవడం ఖాయమే అని చెబుతూనే.. త్వరలో రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆమెకు ఉద్వాసన చెప్పడం కాకుండా.. రాజీనామా కోరాలని హైకమాండ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొత్తవారికి అవకాశం పేరుతో కొండా సురేఖను రాజీనామా చేయాల్సిందిగా సూచించేందుకే హైకమాండ్ భావిస్తోందంటున్నారు. ఏది ఏమైనా రానున్న రెండు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. [Congress High Command Softcorner on Konda Surekha, Telangana Congress, CM Revanth, Cabinet Expanssion, Telugu One]

Published on: Mon Aug 31, 2026 11:21AM

political-news-img

జగన్ వ్యాఖ్యలకు కొత్త భాష్యం చెప్పిన బొత్స.!

వైసీపీ అధినేత జగన్.. తన వ్యాఖ్యలతో పార్టీకి కలిగిన నష్టాన్ని నివారించేందుకు బొత్స రంగంలోకి దిగారు. నష్ట నివారణ కోసం ఆయన జగన్ వ్యాఖ్యలకు కొత్త భాష్యం చెప్పారు. స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలు ఉండడానికి వీల్లేదన్న జగన్ ఆదేశాలకు భిన్నంగా, బొత్స సత్యనారాయణ స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలు రెండు రకాలుగా ఉంటాయంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. వాటిలో ఒకటి.. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం వాటిని ప్రోత్సహించడం. మరొకటి, రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలను నిర్వహించడమంటూ బొత్స చెప్పిన భాష్యంపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. ఇక వైసీపీ వర్గాలైతే.. అసలు బొత్స చెప్పిందేంటో అర్ధం కాక తలలు పగలకొట్టుకుంటున్నారు. ఇంతకీ బొత్స చెప్పినదేంటంటే.. జగన్ ఆదేశించినంత మాత్రాన ఏకగ్రీవాలు జరగకుండా పోవని, అంటే పార్టీ అధినేత మాటను ఆయన ఖండిచారన్న మాట. ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల ప్రతినిధులకు తదుపరి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు దక్కవంటూ జగన్ చేసిన హెచ్చరిక నేపథ్యంలో బొత్స వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అలాగే.. తాజాగా వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిపై కూడా బొత్స విరుచుకుపడ్డారు. విజయసాయిని ఆయన మరో కేఏపాల్ గా అభివర్ణించారు. విజయసాయి.. నోటికి వచ్చినట్లు మాట్లాడతారనీ, ఆయన మాటలకు ఇసుమంతైనా విలువ ఉండదని బొత్స అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చన్న స్పీకర్ హెచ్చరికపై.. తనదైన శైలిలో సవాల్ విసిరారు... నిజంగా స్పీకర్ కు ఆ అధికారం ఉంటే రద్దు చేసుకోవచ్చన్నారు. సభ్యత్వాలు రద్దు చేస్తే.. వైసీపీ రాజ్యాంగ బద్ధంగా పోరాడుతుందన్నారు. [Botsa New Interpretation on Jagan Comments, Botsa, YS Jagan Mohan Reddy, YCP Unanimous Elections, Localbodies, AP Politics, Telugu One]

Published on: Mon Aug 31, 2026 10:55AM

political-news-img

రాజేంద్రనగర్ నియోజకవర్గ MIM ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్..!

బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ తరఫున సంస్థాగత కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు, పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ప్రాతినిధ్యం వహించే బాధ్యతలను మహ్మద్ ముబీన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన AIMIM పార్టీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు మహ్మద్ ముబీన్‌తో సమన్వయం చేసుకుంటూ పార్టీ సంస్థాగత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పార్టీ సూచించింది. నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరపాలని పేర్కొంది. ముబీన్‌కు అప్పగించిన కొత్త బాధ్యతలతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. MLA Mohammed Mubeen, Rajendranagar MIM in-charge, AIMIM, Asaduddin Owaisi, MLC Rahmat Beg, Telugu news, Telugu one

Published on: Sun Aug 30, 2026 5:30PM