మంత్రా? వీధి రౌడీనా?

Publish Date:Jul 22, 2015

Advertisement

 

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే మంత్రి పదవిలో వైభోగం అనుభవిస్తున్నారన్నది ఆయనపై తాజాగా వచ్చిన ఆరోపణ. ఆయన  తాను రాజీనామా చేసినట్టుగా నాటకం ఆడి రాజ్యాంగాన్ని అవమానించారని ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఈ రెండు పార్టీలూ అలుపెరుగని పోరాటం చేయడానికి పూర్తిగా ప్రిపేర్ అయి వున్నాయి. దీంట్లో భాగంగానే టీటీడీపీ నేతలు మంగళవారం నాడు గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన మాటలు ఆయన ఒక రాష్ట్రానికి మంత్రా? లేక ఒక వీధి రౌడీనా అనే సందేహాలు కలుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక మంత్రిగారిని వీధి రౌడీతో పోల్చడం న్యాయం కాదు కదా అని ప్రశ్నిస్తే, ఒక్కసారి మంత్రిగారు మాట్లాడిన తీరును పరిశీలించండని అంటున్నారు.

తాను ఉత్తుత్తి రాజీనామా చేసి రాజ్యాంగాన్ని అవమానించినట్టు ఆరోపణలు వచ్చినప్పుడు ఆ విషయంలో తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఒక మంత్రిగా ఆయన మీద వుంది. మంగళవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఏదో ఒక కాగితాన్ని చూపించి నేను ఏనాడో రాజీనామా చేశానని అంటున్నారే తప్ప... ఆ విషయంలో స్పష్టంగా మాట్లాడలేదు. తన రాజీనామాకు సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సహా స్పష్టంగా బయటపెడితే ఈ విషయంలో పోరాటం చేస్తున్న టీటీడీపీ, కాంగ్రెస్ నాయకులు చల్లబడేవారు. అయితే తలసాని అలా చేయకుండా తన హోదాను మరచిపోయి మాట్లాడారని పలువురు అంటున్నారు. తన జోలికి వస్తే ఖబడ్దార్ అని, తన జోలికి వచ్చిన వారి ఒక్కొక్కళ్ళ బతుకు బయట పెడతానని, తాను రాజకీయాలు వద్దని అనుకుంటే పరిస్థితి వేరే రకంగా వుంటుందని అనడం ప్రతిపక్ష నాయకులను ఒక వీధి రౌడీ తరహాలో బెదిరించినట్టే వుందని అంటున్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వున్న వ్యక్తిని వీధి రౌడీతో పోల్చడం మాత్రం న్యాయం కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వీధి రౌడీ అని అంటున్నవాళ్ళు అలాంటి కామెంట్లు చేయకుండా వుంటే పద్ధతిగా వుంటుంది.

By
en-us Political News

  
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.