ఎర్రబెల్లి పై వరంగల్లు జిల్లాలో కేసు
Publish Date:Jan 5, 2012
Advertisement
వరంగల్: రెచ్చగట్టే ప్రకటనలు చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావుపై వరంగల్లు జిల్లా సుబేదారి పోలీసు స్టేషనులో కేసు నమోదైంది.తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వరంగల్లు జిల్లా పర్యటన నేపథ్యంలో దయాకర్ రావు తెరాస నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.దానిఫై తెలంగాణ రాష్ట్ర సమితి రైతు విభాగం నేతలు దయాకర్ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దయాకర్ రావును వెంటనే అరెస్టు చేయాలని తెరాస రైతు విభాగం నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు.ఇదిలా వుంటే, చంద్రబాబు వరంగల్లు జిల్లా పర్యటన నేపథ్యంలో శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ సహా పలువురిని పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనను అడ్డుకుంటామని తెరాస నాయకులు చెబుతున్నారు. కాగా, చంద్రబాబు వరంగల్లు జిల్లా పర్యటనపై తెరాస నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించిన తర్వాతనే చంద్రబాబును తెలంగాణలో పర్యటనకు అనుమతిస్తామని తెరాస నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. తాను సమైక్యవాదిని చెప్పినా కూడా చంద్రబాబును అడ్డుకోబోమని ఆయన అన్నారు.
http://www.teluguone.com/news/content/ttdp-foram-24-10657.html





