ఊ కొట్టేదెవరో... ఉలిక్కిపడేదెవరో...!

Publish Date:Aug 25, 2012

Advertisement

రాజకీయాలంటే చదరంగం లాంటివని కొందరంటే... వైకుంఠపాళి ఆటలాంటిదని మరికొందరంటారు. ఎవరేమన్నా.. జనవాక్యం మాత్రం ఈ రెండు ఆటలు కలిపితేనే రాజకీయా లంటుంది. ఎన్నికల సమయంలో వైకుంఠపాళి ఆటలాంటిది. ప్రత్యర్ధుల బలాబలాలను బేరీజువేసుకుని నిచ్చెనల ఎక్కుతూ ఎవరు గెలుస్తారో.. ఇతరుల బలాబలాలను అంచనా వేయకుండా ఓటమి పామునోట్లో చిక్కి ఎవరు ఓడిపోతారో.. అదంతా పరమపదసోపానమే! రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తే తప్ప లేకుంటే... పెత్తనమంతా కేంద్రంలోవుండే అధినాయకుల చేతల్లో, చేతుల్లోనే ఉండి పాలన సాగుతుంది.

 

తుమ్మినా, దగ్గినా ఢల్లీకి ప్రయాణం కట్టాల్సిందే. ఇలాంటి ప్రయాణాలకే రాష్ట్ర ఖజానాలో సొమ్ము సగం ఖర్చవుతుందే మోనని సామాన్యుల అనుమానం. అసలు సంగతేమిటయ్యా అంటే.. ధర్మానగారి రాజీనామా నేపథ్యంలో సి.ఎం. మొదలు మంత్రులు, రాష్ట్ర అధ్యక్ష పదవుల వరకు ఎవరూ ఉంటారో, ఎవరు ఊడతారో... తెలియదు. అధిష్టానం వద్ద తమ పలుకుబడిని ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తే వారికే ఆయా పదవులు అన్నది జగద్విదితం. మహాభారతంలోని రాజకీయ ఘట్టాలకు ఏ మాత్రం తీసిపోవు హస్తిన రాజకీయాలు. బొత్సకు ఉద్వాసన...? సిఎం. స్థానానికి ఎసరా? కొత్తగా పిసిసి చీఫ్‌గా ఎవరు ఎన్నికవుతారు? మంత్రుల్లో ఎవరికి ఉద్వాసన..? ఇవన్నీ ప్రజలకు కాకపోయినా కాంగ్రెస్‌పార్టీలోని నాయకులను వేధిస్తున్న యక్షప్రశ్నలు...!

 

ఇవి ఇప్పుడే రావడానికి ప్రధాన కారణాలు ‘తెలంగాణా ఉద్యమ తీవ్రత, జగన్‌పై సిబిఐ కేసుల వ్యవహారం, పెద్దాయన మంత్రివర్గంలో వున్న పలువురు మంత్రులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణల గోల.. తదితరాలు. ఎంత మెజారిటీతో ఎన్నికైనా స్వంత వ్యక్తిత్వమంటూ లేకుండా తుమ్మినా.. దగ్గినా రాజధాని విమానమెక్కేయడం... ఎన్నికయ్యేందుకు... ఎన్నికైన తర్వాత కృతజ్ఞతలు తెలిపేందుకు.. వచ్చిన పదవిని కాపాడుకునేందుకు విమాన ప్రయాణాలు...! ఇంట్లో తనకిష్టమైన కూరచేయించుకు తినాలన్నా.. అమ్మదయ కావాల్సిందే... అన్నట్లుగా ఉంటున్నాయి కాంగ్రెస్‌ పార్టీలోని నేతల తీరు! అమ్మ చెప్పిన దానికి ఎంతమంది నేతలు ఊ కొడతారో... అమ్మనిర్ణయానికి ఎంతమంది ఊలిక్కిపడతారో... వేచిచూడాల్సిందే..!

By
en-us Political News

  
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.