కప్పగంతులు...

Publish Date:Aug 25, 2012

Advertisement

ఈ మధ్యకాలంలో పిచ్చివాడికి ఏదైనా గుర్తుకొచ్చి నవ్వినా .. అదిగో నన్నుచూసే నవ్వాడు.. నన్ను అవమానించాడు... కొంతమంది పార్టీలోని నేతలే దీని వెనుకవుండి చేయించారు. కనుక నేను ఈ పార్టీలో ఉండలేను.. అంటూ మరోచోటుకు గెంతడం..పరిపాటి! లేకుంటే.. నన్ను కాదని పార్టీలోని తన ప్రత్యర్ధికి పదవి ఇచ్చారనో.. ఇంట్లో చేసుకున్న వంకాయకూర.. వెంటవున్న నాకు పెట్టకుండా.. బయటనుండి వచ్చిన ఇంకొకరి పెట్టారనో... కూడా పార్టీ మారిపోవచ్చు. ఇలా పార్టీలు మారే ఉద్దేశమే ఉండాలికాని ఎన్నో... ఎన్నెన్నో... కారణాలు చెప్పుకోవచ్చు! ప్రజాసేవకోసమే రాజకీయాల్లోకి వచ్చాను.. అందుకే ఈ పార్టీలో చేరా.. కాని నన్ను కూరలో కరివేపాకులా తీసేస్తున్నారు... మనస్తాపంతో బయటికివెళ్ళిపోతున్నా...ఇదీ నేటి నేతలు ఒకచోటునుండి మరోచోటుకు చేసే కప్పగంతులకు ఇచ్చే వివరణ.

 

గతంలో ఎంతోమంది నేతలు తామున్న పార్టీలోనుండి మరోపార్టీలోకి వెళ్ళారు. అదే రీతిలో ఉప్పునూతల కూడా జగన్‌పార్టీలోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. విలువలకు కట్టుబడి ఒకేపార్టీలో ఉండటమన్నది నేడు ఎక్కడా చూడలేం. ఇంద్రదనస్సులో ఏడువర్ణాలు ఉంటాయి. నేటి నేతలకు ఎన్ని వర్ణాలుంటాయో చెప్పడం కష్టమే సుమా! ఇసుకను పిండి తైలం తీసే ప్రయత్నం చేయవచ్చుగాని పార్టీలు మారే నేతల చేతలను, మాటలను అర్ధం చేసుకోలేం. ‘ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే...’ అన్నాడు ఓ సినీకవి. కాని నేటి రాజకీయాలను చూస్తుంటే... ‘నాయకులమాటలకు అర్ధాలే వేరులే...’ అని అనక తప్పదు.

 

ఒకరు ఓ పార్టీ తరపున ఎన్నికై తెల్లవారే సరికి మరోపార్టీలో ఉంటారు. ఇలా కప్పగంతులు గెంతుతూనే ఉన్నారు. ఉంటున్నారు. భవిష్యత్‌లో కూడా ఉంటారు! ఇలాగే ఉపేక్షిస్తే... ఇలా పార్టీలను మార్చే వారితో దేశం నిండిపోయి.. అత్యధికంగా పార్టీలు మార్చిన నేతలు గిన్నీస్‌ రికార్డులను బద్ధలు కొట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు. గతంలో ఎక్కువశాతంమంది ప్రజాసేవకోసం రాజకీయాల్లోకి వస్తే... నేడు తమ రక్షణకోసం, తమవారిసేవకోసం మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నారు.. పార్టీలు మారుతున్నారు. పార్టీలు మార్చే నేతల్ని చూసి ఊసరవెల్లి కూడా కాస్తంత ఫీలవుతోంది మరి! ఒక పార్టీ తరఫున ఒకసారి ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పట్నుంచి అయిదేళ్ళపాటు ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటామంటూ అభ్యర్ధుల నుండి అఫిడవిట్లు తీసుకుంటే బావుంటుందేమో...! ఆలోచించాల్సిందే!

By
en-us Political News

  
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.