విజయ్ ఖాళీ చేసే స్థానం నుంచి స్టాలిన్ పోటీ?

Publish Date:May 16, 2026

Advertisement

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్వల్ప వ్యవధిలోనే..  పలు కీలక నిర్ణయాలతో రాజకీయాలకు అతీతంగా మంచి మార్కులు కొట్టేస్తున్నారు.   ఈ తరుణంలో  ఎన్నికలలో తన సొంత నియోజకవర్గమైన  కోలత్తూరులో  ఊహించని రీతిలో ఓటమి పాలైన స్టాలిన్ కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. 

అదలా ఉంటే.. అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు   తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో రంగంలోకి దిగాలని స్టాలిన్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈస్ట్ తిరుచ్చి నుంచి టీవీకే అధినేత విజయ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.  నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో విజయ్  తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా త్వరలోనే తిరుచ్చి ఈస్ట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.  ఈ ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీకి దిగి.. విజయ్‌తో  నేరుగా తలపడేందుకు సిద్ధంగా ఉన్నానని నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మరోవైపు..  డీఎంకే శ్రేణులు కూడా ఈ స్థానంపై తీవ్రంగా దృష్టి సారించాయి. తిరుచ్చి సౌత్ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ మేరకు కీలక తీర్మానాన్ని కూడా ఆమోదించింది.  తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్వయంగా పోటీ చేయాలని పార్టీ స్థానిక నాయకత్వం, శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావచ్చని వారు అంటున్నారు.

అయితే, ఈ స్థానంలో పోటీ చేయడం స్టాలిన్‌కు అంత తేలికైన విషయం కాదు. ఇది ఒక రకంగా అతిపెద్ద జూదమనే చెప్పాలి. ఎందుకంటే..  విజయ్ నేతృత్వంలోని టీవీకే కి ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా స్టాలిన్ ఓటమి పాలైతే, అది ఆయన రాజకీయ జీవితంలో   కోలుకోలేని దెబ్బగా మారే అవకాశం ఉంది. కాగా ఈస్ట్ తిరుచ్చి ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీ చేస్తారన్న అధికారిక ప్రకటన అయితే ఇంత వరకూ రాలేదు. ఈ స్థానం నుంచి స్టాలిన్ నిజంగానే బరిలోకి దిగుతారా అన్న విషయంలో స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.  

By
en-us Political News

  
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత, జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.