కరీంనగర్ నా కాషాయ అడ్డా: కాంగ్రెస్‌కు బండి సంజయ్ సవాల్.!

Publish Date:Nov 23, 2026

Advertisement

కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది. మహా పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కరీంనగర్‌లో కనిపిస్తున్న కాషాయ ప్రభంజనాన్ని చూసి తన మనసు పులకించిపోతోందని అన్నారు. తనను కన్న కరీంనగర్ గడ్డ ఉరకలేస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ గడ్డపై అడుగుపెట్టడంతో తన గుండె ఉప్పొంగుతోందన్నారు.

నమ్మిన సిద్ధాంతం కోసం, భుజాన ఉన్న కాషాయ జెండా కోసం ఎంతవరకైనా పోరాడతానని బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ తన కాషాయ అడ్డా అని తొడగొట్టి సవాల్ విసరాలనిపిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు.. కరీంనగర్‌లో కనిపిస్తున్న జన ప్రభంజనాన్ని చూడాలని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను రాజకీయంగా ఎదుర్కొనేందుకు కాషాయ దళం సిద్ధంగా ఉందని అన్నారు.

నితిన్ నబిన్‌పై బండి సంజయ్ ప్రశంసల వర్షం.!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను బండి సంజయ్ కొనియాడారు. ఆయన సాధారణ నాయకుడు కాదని, కొదమసింహం అంటూ అభివర్ణించారు. నబిన్ చూపుల్లో పదును ఉందని, ఆయన పక్కన నిలబడితేనే వేడి తెలుస్తోందని వ్యాఖ్యానించారు. నితిన్ అంటే నిజాయితీ, నైతికత.. నబిన్ అంటే నూతనత్వమని అభివర్ణించారు.

25 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై, ఐదుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన నాయకుడిగా నితిన్ నబిన్ ఎదిగారని గుర్తుచేశారు. 45 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఒక సామాన్య కార్యకర్త పార్టీని నడిపించే స్థాయికి ఎదగడం బీజేపీలోనే సాధ్యమని పేర్కొన్నారు.

నితిన్ నబిన్‌కు చిన్నతనంలో రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని, ఉన్నత విద్య అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలనుకున్నారని బండి సంజయ్ చెప్పారు. అయితే ఆర్ఎస్ఎస్ నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, దేశం కోసం పనిచేయాలనే అంకితభావమే ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని ప్రశంసించారు.

బీజేపీ కార్యకర్తల పోరాటాన్ని గుర్తుచేస్తూ..!

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కార్యకర్తలు ఏళ్ల తరబడి పోరాడుతున్నారని బండి సంజయ్ అన్నారు. కాషాయ జెండాను మోస్తూ కార్యకర్తల భుజాలు కాయలు కాశాయని, లాఠీ దెబ్బలు తిన్నా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు. కాషాయ కండువా కప్పుకున్న ప్రతి కార్యకర్త, నాయకుడు ఇదే సంకల్పంతో పనిచేస్తున్నారని అన్నారు.

SIR, ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్‌కు ప్రశ్నలు.!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ గాంధీ SIR ప్రక్రియను వ్యతిరేకించడంపై ప్రశ్నలు సంధించారు. మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓటర్లు, అర్హత లేని ఓట్లను తొలగిస్తే కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బందేంటని నిలదీశారు.

దేశంలోకి అక్రమంగా వలస వచ్చినవారికి ఓటు హక్కు కల్పించడం సరికాదని, అర్హులైన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు ఉండాలని అన్నారు. విదేశీ చొరబాటుదారులు ఓట్లు, రేషన్ కార్డులు పొందుతూ స్థానిక ప్రజల హక్కులకు భంగం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన ఎన్ని రాజకీయ డ్రామాలు చేసినా, విదేశీ శక్తులతో కలిసి కుట్రలు చేసినా బీజేపీ వెనక్కి తగ్గదని అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

డ్రగ్స్‌పై మోదీ పోరాటానికి మద్దతివ్వాలని పిలుపు.!

దేశంలో డ్రగ్స్ సమస్య యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్న పరిస్థితిని చూసి ప్రధాని మోదీ ఆవేదన చెందుతున్నారని చెప్పారు. నషా ముక్త్ భారత్ లక్ష్యంతో డ్రగ్స్ రహిత సమాజం కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు, కోటి ఓట్లు వస్తాయన్న అంచనాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. అందరికీ అధికారం ఇచ్చారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.


కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే మహా పాదయాత్ర: రాంచందర్ రావు 

మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఈ మహా పాదయాత్ర చేపట్టినట్లు స్పష్టం చేశారు.

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పలుమార్లు SIR ప్రక్రియ జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎనిమిదిసార్లు SIR జరిగినా అప్పట్లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

ప్రధాని మోదీ ఎన్నిక చెల్లదంటూ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని రాంచందర్ రావు విమర్శించారు. మోదీ ఎన్నిక చెల్లదంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిక కూడా చెల్లదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు.

విదేశీ శక్తులతో కలిసి భారత్‌ను అవమానించేలా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ విమర్శలకు సమాధానం చెప్పడంతో పాటు, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మహా పాదయాత్ర లక్ష్యమని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

మీకు నచ్చవచ్చు: Gen z:  24 ఏళ్లకే డిప్యూటీ మేయర్‌.. టీడీపీ కూటమి సంచలన నిర్ణయం.!

మీకు నచ్చవచ్చు: ఫేస్‌ క్రీమ్‌ వాడితే కిడ్నీలు డ్యామేజ్..అసలేం జరిగిందంటే.!

 

 

[ Karimnagar BJP Maha Padayatra, Nitin Nabin, Bandi Sanjay, BJP Telangana, N Ramchander Rao, Rahul Gandhi, SIR Controversy ]
 

By
en-us Political News

  
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ముఖంపై చిన్న మొటిమ వచ్చినా.. చర్మంపై నల్లటి మచ్చ కనిపించినా అమ్మాయిలు ఆందోళన చెందుతారు.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో లోతైన సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని సినీ నటుడు ప్రభాస్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు.
అంతర్జాతీయ దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఇటీవల గణనీయంగా పడిపోవడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల్లో తీవ్ర చర్చ మొదలైంది.
బుల్లితెర ప్రేక్షకులను నవ్వించే జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడంపై ఢిల్లీకి చెందిన చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది.
తాళి కట్టిన 24 గంటల్లోనే బిడ్డకు జన్మ..అసలు కథేంటి.?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.