టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం

Publish Date:Nov 20, 2025

Advertisement

 

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సిట్ దూకుడు పెంచింది.  ఈ కేసు దర్యాప్తులో ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్న అంశాలు విస్తుగొలుపుతున్నాయి.  మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలోనే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నది. అంతే కాకుండా ఈ వ్యవహారంలో వైసీపీ కీలక నేతల హస్తం ఉందని దర్యాప్తులో వెలుగులోనికి వస్తున్నది. జగన్ హయాంలో టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని సిట్ ఇప్పటికే విచారించింది. ఈ విచారణలో ధర్మారెడ్డి కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.  ఇప్పుడు తాజాగా  టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ విచారించింది. గురువారం (నవంబర్ 19) ఉదయం వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే విచారించారు. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో సిట్ అధికారులు వైసీ సుబ్బారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. 

 ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నతో పాటు టీటీడీ మాజీ ఈవో, పలు కీలక అధికారులు విచారణను ఎదుర్కొన్నారు. వారి వాంగ్మూలాలన సిట్ రికార్డు చేసింది. వారి విచారణలో వెలుగులోనికి వచ్చిన అంశాలు, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారంతో అధికారులు సుబ్బారెడ్డిని విచారించారు.  టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత, కొనుగోలు విధానాలు, కాంట్రాక్టుల కేటాయింపులపై సిట్ అధికారుల ప్రశ్నలతో వైవీ సుబ్బారెడ్డి ఉక్కిరిబిక్కిరైనట్లు సమాచారం.  సుబ్బారెడ్డి విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోనికి వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వినియోగం కేసులో వైవీ సుబ్బారెడ్డి విచారణ అత్యంత కీలకంగా భావిస్తున్నారు.   

తొలుత ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైవీ సుబ్బారెడ్డికి సిట్ అధికారులు  నోటీసులు జారీ చేశారు. అయితే.. అరోగ్యం సహకరించని కారణంగా తాను విచారణకు రాలేననీ వైవీ చెప్పడంతో సిట్ అధికారులు నేరుగా హైదరాబాద్ వచ్చి సుబ్బారెడ్డిని ఆయన నివాసంలోనే విచారించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరిందన్న సంకేతాలను ఇచ్చింది.  

వైసీపీ ప్రభుత్వ హయాంలో సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన సంస్థలు, వాటితో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఛైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై ఈ విచారణలో కీలక సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించిన సంగతి తెలిసిందే. అప్పన విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా ఇప్పుడు సుబ్బారెడ్డిని ప్రశ్నించినట్లు చెబుతున్నారు.  

By
en-us Political News

  
జూన్ 15 సోమవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ మరియు ముంబై నగరాల్లో నేటి లేటెస్ట్ 22 క్యారట్, 24 క్యారట్ గోల్డ్ రేట్ల వివరాలు ఇక్కడ చూడండి.
ఆర్థిక సంవత్సరం 2026-27 ఐటీఆర్ ఫైలింగ్ వేళ మీ వార్షిక ఆర్థిక సమాచార నివేదిక (AIS) ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి. ఫామ్ 16, ఫామ్ 26AS మరియు ఏఐఎస్ ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను మరియు సులభమైన డౌన్‌లోడ్ విధానాన్ని ఇక్కడ చూడండి.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో పాకిస్థాన్ 64 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ పరాజయంపై పాక్ కెప్టెన్ ఫాతిమా సనా సంచలన వ్యాఖ్యలు చేసింది. పవర్‌ప్లేలో ఆధిపత్యం సాధించినా, సీనియర్ల ఫీల్డింగ్ తప్పిదాలు మరియు బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామని అంగీకరించింది. పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి!
ఫిఫా ప్రపంచకప్ 2026లో జర్మనీ 7-1 తేడాతో కురాకో జట్టును చిత్తు చేసి ఘన విజయం సాధించింది. కై హావెర్ట్జ్ రెండు గోల్స్‌తో రాణించగా, హ్యూస్టన్ స్టేడియంలో జర్మనీ సునామీ సృష్టించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆర్బియో (Orbio) స్టార్టప్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫ్రంట్‌లైన్ కార్మికుల ఆన్‌బోర్డింగ్, రిక్రూట్‌మెంట్‌ను ఆటోమేట్ చేయడానికి ఏకంగా 21 మిలియన్ డాలర్ల భారీ సిరీస్ ఏ ఫండింగ్‌ను సాధించింది. మరియా, డేనియల్ వంటి ఏఐ ఏజెంట్లతో రిక్రూట్‌మెంట్ రంగంలో రాబోతున్న ఈ విప్లవాత్మక మార్పుల పూర్తి వివరాలు మీకోసం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల కొన్ని పరిశ్రమలు పూర్తిగా ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హెచ్చరించారు. ఏఐ తెస్తున్న ముప్పు, కాగ్నిటివ్ లూప్ మరియు ఆర్థిక సమానత్వంపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
సావరిన్ గోల్డ్ బాండ్ (SGB 2019-20 Series II) ఇన్వెస్టర్లకు ఆర్బీఐ ముందస్తు ఉపసంహరణ అవకాశం కల్పించింది. జూలై 6 లోపు ఎలా దరఖాస్తు చేయాలో, లభించే పన్ను ప్రయోజనాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫాల్ 2026 సెమిస్టర్ కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులకు యూఎస్ ఎఫ్-1 వీసా స్లాట్ల కొరత పెద్ద తలనొప్పిగా మారింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ కాన్సులేట్లలో స్లాట్లు బుక్ చేసుకోవడానికి ఉత్తమ సమయాలు, రీషెడ్యూల్ నిబంధనలు మరియు మోసాల బారిన పడకుండా స్లాట్ ఎలా సాధించాలో ఈ కథనంలో పూర్తిగా తెలుసుకోండి.
భారత ప్రధాని ఇమేజ్ ను అమెరికా అధ్యక్షుడి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమేంటా? అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కొన్ని వివాదాస్పద విదేశీ విధానాలు, నిర్ణయాల వల్ల ఇండియా ప్రధాని మోడీ ఇమేజ్ సన్నగిల్లుతోందన్న చర్చ రాజకీయవర్గిల్లో జోరుగా సాగుతోంది.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ ఇబ్బందులపై సైబరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. ఐటీ కంపెనీలకు నోటీసులతో పాటు ₹1,000 జరిమానా విధిస్తూ చేపట్టిన ప్రత్యేక చర్యల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అమరావతి నిర్మాణ వేగాన్ని పెంచడానికి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులను తీసుకురావడానికి ఈ పర్యటన కీలకంగా చెబుతున్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, అక్కడి సీనియర్ క్యాబినెట్ మంత్రులతో చంద్రబాబు నేరుగా చర్చలు జరపనున్నారు. ఈ ప్రభుత్వాల మధ్య ప్రత్యక్ష సహకారం అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అమరావతి భవిష్యత్తుకు ఒక బలమైన పునాది కానుందని ఆయన విశ్వసిస్తున్నారు.
టర్కీలో జరిగిన ఆర్చేరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో భారత రికర్వ్ ఆర్చర్లు ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహోద్ సంచలన ప్రదర్శనతో ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి బంగారు పతకాన్ని సాధించారు. ధీరజ్ వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణంతో డబుల్ ధమాకా సృష్టించాడు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఇకపై వర్షాలు కురిసే సమయంలో ఏ ఒక్క అధికారి కూడా కార్యాలయాలకో, ఇళ్లకో పరిమితం కాకూడదనీ, మున్సిపల్, పోలీస్, జలమండలి, విద్యుత్ శాఖల అధికారులు ఖచ్చితంగా రోడ్లపైనే ఉండి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలని విస్పష్టంగా చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.