Publish Date:Nov 20, 2025
వికారాబాద్ హత్యల కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ వికారాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ మేజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యా పిల్లలను హత్య చేసిన కేసులో కోర్టు నిందితుడు ప్రవీణ్ కుమార్ కు ఉరిశిక్ష విధిస్తూ గురువారం (నవంబర్ 22) తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెడితే..
వికారాబాద్ పట్టణంలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించే ప్రవీణ్ కుమార్ కు అప్పటికే పెళ్లై ఒక కొడుకు ఉన్న మహిళతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. దీంతో వారివురూ వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప జన్మించింది. అయితే వివాహం తరువాత ప్రవీణ్ కుమార్ మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు.
2019 ఆగస్టు 5 రాత్రి పీకలదాకా మద్యం సేవించిన ప్రవీణ్ కుమార్ ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణ పడ్డాడు. గొడవ పెద్దదవ్వడంతో ఆగ్రహానికి లోన ప్రవీణ్ కుమార్ ఇంట్లో ఉన్న ఇనుప రాడ్ తో భార్య మరియు ఐదేళ్ల కుమార్తెను కొట్టి హతమార్చాడు. అనంతరం 9 ఏళ్ల కుమారుడని గొంతు నులిమి హత్య చేశాడు. భార్యా పిల్లలను హత్య చేసిన అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్య మొబైల్లో మెసేజీలు చూసి అనుమానం పెంచుకుని భార్య పిల్లలను హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. పోలీసులు సాక్ష్యాధారాలు లను సేకరించి కోర్టులో సమర్పించారు. ఈ మేరకు కోర్టు విచారణ జరిపి నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/death-penality-vikarabad-court-verdict-36-209840.html
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.