ట్రంప్ లక్ష్యంగా కాల్పులు.. స్టేజి డ్రామా అంటూ నెటిజనుల డౌట్లు!

Publish Date:Apr 27, 2026

Advertisement

అమెరికాలో పెనుసంచలనం సృష్టించిన కాల్పుల ఘటనపై నెటిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌లు పాల్గొన్న ఒక అధికారిక విందు కార్యక్రమంలో అకస్మాత్తుగా కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రదేశంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఒక్కసారిగా అందరినీ ఉలికిపాటుకు గురి చేసింది.  ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోనికి తీసుకున్నాయి.  అయితే ఇప్పుడు ఈ కాల్పుల ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఈ కాల్పుల ఘటనను నెటిజనులు ఒక ప్రణాళిక మేరకు జరిగిన స్టేజ్డ్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. డొనాల్డ్  ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, పడిపోతున్న తన ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం ఆడిన నాటకంగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.  కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందు  ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌ను భద్రతా సిబ్బంది  అక్కడి నుండి తరలించడం ఏమిటని నిలదీస్తున్నారు.  అధ్యక్షుడి భద్రత పట్ల భద్రతా సిబ్బందికి పెద్ద ఆందోళన లేనట్లు కనిపించిందనీ, దీనిని బట్టి  ఈ కాల్పుల ఘటన అంతా  స్క్రిప్ట్ ప్రకారం జరిగిందనిపిస్తోందని నెటిజనులు అంటున్నారు. ఇరాన్ యుద్ధం,  దేశీయ రాజకీయాల్లో ట్రంప్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే  వ్యూహాత్మకంగా ఈ షూట్ ఔట్ డ్రామాను తెరమీదకి తీసుకువచ్చారని అంటున్నారు.  మరీ ముఖ్యంగా  ఈ కాల్పుల ఘటన   ఒక రెజ్లింగ్ మ్యాచ్‌లోని డ్రామా తరహాలో సాగిందన్న విమర్శలు నెట్టింట వెల్లువెత్తుతున్నాయి.  ఈ విందు కార్యక్రమానికి ముందే షూటౌట్ జరుగుతుందనే సంకేతాలు వెలువడ్డాయని, ఇది పూర్తిగా ప్లాన్ చేసిన వ్యవహారమనీ కొందరు పోస్టులు పెడుతున్నారు.

ప్రస్తుతం ఈ కాల్పుల ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. నిందితుడి నేపథ్యం?   అతనికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా?   వ్యక్తిగత కారణాలతో చేసిన దాడా? అనే కోణంలో  దర్యాప్తు సాగుతోంది. అది పక్కన పెడితే.. సామాజిక మాధ్యమంలో  వస్తున్న ఈ  స్టేజ్డ్ డ్రామా ఆరోపణలు ట్రంప్ రాజకీయ ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది.  మొత్తం మీద ఈ కాల్పుల ఘటన ట్రంప్ కు ఇసుమంతైనా సానుభూతి సాధించి పెట్టలేదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి ఉక్కుపాదం మోపుతున్నారు
మహిళలకు బంగారం.. పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరం..!
ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తులు ఇప్పించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆగస్టు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, మొత్తం 3 రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది
సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్ట్ ఇవ్వాలి.. కోర్టు ఆదేశాలు..!
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైన ఈ కంటెంట్‌ను నీచమైన, నిందాపూర్వకమైనదిగా  పేర్కొంది. ఇలాంటి హానికరమైన, అసత్యపూరితమైన పోస్టులకు బహిరంగ వేదికలలో ఏమాత్రం స్థానం ఉండకూడదని స్పష్టం చేసింది.
దిల్‌సుఖ్‌నగర్‌లో తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి కారు పేరుతో కలకలం..!
వాహన యజమానులు   సామాజిక, చట్టబద్ధమైన బాధ్యతను గుర్తించేలా చేయడం,  దురదృష్టవశాత్తు రహదారి ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు తగిన ఆర్థిక పరిహారం సకాలంలో అందేలా చూడటమే ఈ ప్రతిపాదిత మార్గదర్శకాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. 
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
భారత క్రీడారంగంలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన ఘట్టం సాగర తీర నగరం విశాఖపట్నంలో ఆవిష్కృతమైంది.
ట్రైనీ మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.