మంటల్లో కాలి దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు

Publish Date:Apr 27, 2026

Advertisement

మెదక్ జిల్లాలో  ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు  వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సోమవారం (ఏప్రిల్ 27) తెల్లవారు జామున 44వ జాతీయ జాతీయ రహదారి 44పై మాసాయిపేట వద్ద ఈ ఘటన జరిగింది. కాగా ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్, క్లీనర్ ప్రమాదాన్ని గమనించి బస్సులోంచి బయటకు దూకేశారు.  

  బస్సులో సాంకేతిక సమస్య తలెత్తడంతో మరమ్మతుల కోసం హైదరాబాద్ నుంచి మెదక్‌కు తీసుకొచ్చారు. మరమ్మతు పూర్తయ్యాక సోమవారం తెల్లవారుజామున డ్రైవర్, క్లీనర్‌ బస్సును తిరిగి హైదరాబాద్‌కు తీసుకువెడుతుండగా.. మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ ను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు వచ్చేశాడు.  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

అయితే, అప్పటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మరమ్మతుల సమయంలో జరిగిన లోపమా? లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

By
en-us Political News

  
ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తులు ఇప్పించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఆగస్టు 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, మొత్తం 3 రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది
సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్ట్ ఇవ్వాలి.. కోర్టు ఆదేశాలు..!
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైన ఈ కంటెంట్‌ను నీచమైన, నిందాపూర్వకమైనదిగా  పేర్కొంది. ఇలాంటి హానికరమైన, అసత్యపూరితమైన పోస్టులకు బహిరంగ వేదికలలో ఏమాత్రం స్థానం ఉండకూడదని స్పష్టం చేసింది.
దిల్‌సుఖ్‌నగర్‌లో తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి కారు పేరుతో కలకలం..!
వాహన యజమానులు   సామాజిక, చట్టబద్ధమైన బాధ్యతను గుర్తించేలా చేయడం,  దురదృష్టవశాత్తు రహదారి ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు తగిన ఆర్థిక పరిహారం సకాలంలో అందేలా చూడటమే ఈ ప్రతిపాదిత మార్గదర్శకాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. 
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
భారత క్రీడారంగంలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన ఘట్టం సాగర తీర నగరం విశాఖపట్నంలో ఆవిష్కృతమైంది.
ట్రైనీ మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
ఇప్పటివరకు పోలీస్‌ అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్న డయల్‌ 100 స్థానంలో 112 నంబర్‌ ను అమలు చేయనున్నారు.  పోలీస్‌, అంబు లెన్స్‌, అగ్నిమాపక సేవల ను ఒకే ఎమర్జెన్సీ నంబర్‌ పరిధిలోకి తీసుకురావడం ఈ కొత్త వ్యవస్థలో  ప్రత్యేకత. 112కు ఫోన్‌ చేస్తే కేవలం పోలీస్‌ సహాయం మాత్రమే కాదు.. పరిస్థితిని బట్టి అంబులెన్స్‌, ఫైర్‌ సర్వీసులను కూడా సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు. 
మొత్తం 76 జూనియర్‌ కాలేజీలు ఫైర్‌ ఎన్‌ఓసీలను సమర్పించగా, వాటిలో ఎనిమిది కాలేజీలు నకిలీ, ఫోర్జ్డ్‌ ఎన్‌ఓసీలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై హైడ్రా అడిషనల్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు మేరకు లేక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.