అమెరికాలో హైదరాబాద్ యువతి మృతి కేసుల్లో కొత్త ట్విస్ట్..!

Publish Date:Aug 26, 2026

Advertisement

 

అమెరికాలోని మేరీల్యాండ్‌లో హైదరాబాద్‌కు చెందిన నిఖిత గోడిశాల అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ మృతి వెనుక కుట్ర దాగి ఉందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయిన అర్జున్ శర్మ నిఖితను ఆర్థిక ఇబ్బందులకు గురి చేసి హత్య చేశాడని, ఈ దారుణంలో ఆయన తల్లి పాత్ర కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడి అరెస్ట్‌పై అమెరికా అధికారులు అధికారిక ప్రకటన ఇవ్వకుండా మౌనం వహించడాన్ని తప్పుబట్టిన కుటుంబ సభ్యులు, నిందితులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి సమగ్ర విచారణ జరపాలన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.

అర్జున్ శర్మ ఆగస్టు, సెప్టెంబర్ 2025లో తన ఉద్యోగాన్ని కోల్పోయారన్నారు. అప్పటి నుంచి మా కుమార్తె మరణించే వరకు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలుకుతూ మా అమ్మాయి దగ్గర, మా కుటుంబం వద్ద పదే పదే డబ్బులు అప్పుగా తీసుకోవడం మొదలుపెట్టారన్నారు. ఆయన కారణంగా మా కుమార్తె అప్పటికే తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి గురైందన్నారు. ఆమె నుంచి మా కుటుంబం నుంచి డబ్బు తీసుకోవడం కొనసాగించారన్నారు. ఆమె చనిపోయే ముందు నెలల వరకు కూడా ఈ ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నారు.

 ఆయన తల్లి రచన శర్మకు ఈ లావాదేవీలన్నీ పూర్తిగా తెలుసన్నారు. ఆమె స్వయంగా మా కుటుంబానికి పలు సందర్భాల్లో డబ్బు తిరిగి చెల్లించిందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆమెకు ఈ ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసని స్పష్టమవుతుందన్నారు. మా కుమార్తె సురక్షితంగా లేదని, ఇది తల్లి-కొడుకులు ఇద్దరూ కలిసి పథకం ప్రకారం చేసిన ముందస్తు హత్యేనని భావిస్తున్నామన్నారు. 

తను నమ్మిన వ్యక్తి చేతిలోనే మోసపోతూ మా కుమార్తె ఈ ఆర్థిక భారాన్ని మోసిందన్న విషయం మాకు తీవ్ర వేదనను కలిగిస్తుందన్మారు. ఈ పరిస్థితులు మా అమ్మాయి మంచి వాతావరణంలో లేదని భావించామన్నారు. ఏం జరుగుతోందో ఆమె స్నేహితులు కొందరు గమనించి, ఆయనకు దూరంగా ఉండాలని ఆమెకు సూచించారన్నారు తల్లిదండ్రులుగా మేము ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందామన్నారు. ఆమె ఎదుర్కొన్న ఆర్థిక దోపిడీ, ఒత్తిడి చివరకు మా కుమార్తెను ఘోరంగా బలి తీసుకుంటుందని ఊహించలేదన్నారు.

మా కుమార్తెను చంపిన వెంటనే ఆమె ఖాతా నుంచి ఆర్థిక లావాదేవీలు జరగడం అత్యంత దిగ్భ్రాంతికరం అన్నారు. ఆ తర్వాత ఆయన మిస్సింగ్ కేసు పెట్టాడన్నారు. కానీ అక్కడి అధికారులు ఆమె అదృశ్యం వెనుక ఉన్న తీవ్రతను సరిగ్గా గుర్తించలేదని భావిస్తున్నామన్నారు. అది డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకల సమయం కావడం వల్ల మా కుమార్తె కేసుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరింత బాధాకరం అన్నారు. మా కుమార్తె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. మాకు సరైన సమాచారం తెలియక ముందే, ఆమె ఫొటోలను ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తూ ఆమెను తప్పుడు రీతిలో చిత్రీకరించారన్నారు. అమెరికా అధికారుల నుంచి సమాచారం అందలేదన్నారు. 

నిందితుడు తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ఆయన తల్లి రక్షణగా ఉంటూ, నేరానికి తగిన శిక్ష పడకుండా తప్పించుకోవడానికి సహాయం చేస్తుందని పేర్కొన్నారు. ఆమె పాత్రపై కూడా సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నామన్నారు. లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. ఆ తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిందన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేసిందన్నారు.

మా కుటుంబం డీసీపీ రక్షిత మూర్తిని సంప్రదించిందన్నారు. ఆమె, నిందితుడి అరెస్ట్ గురించి మాకు సమాచారం అందించడమే కాకుండా, ఈ మొత్తం వ్యవహారంలో మాకు నిరంతరం అండగా ఉంటూ, సరైన మార్గదర్శకత్వం చేస్తూ సంబంధిత అధికారులు, భాగస్వామ్య వర్గాలతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. మా కుమార్తెకు న్యాయం చేయాలని అహర్నిశలు పోరాడామన్నారు. ఈ కష్ట సమయంలో మా కుటుంబానికి ఎంతో అండగా నిలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, పలువురు బీజేపీ నాయకులకు, ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యులకు, ఎంసీఆర్ఎఫ్ ఫౌండేషన్‌కు, సీబీఐ, మహిళా కమిషన్‌కు, ఐపీఎస్ అధికారులు చారు సిన్హా, రక్షిత మూర్తి, ఉద్యమకారులు దివ్య వడ్లపూడి, డాక్టర్ గోవిందరాజులు వడ్లపూడికి కృతజ్ఞతలు తెలిపారు.

Hyderabad woman dies in America, Nikhitha godisala,  Cyberabad Police,  CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy, DCP Rakshit Murthy
 

By
en-us Political News

  
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.