జగన్ వర్సెస్ సజ్జల: వైసీపీలో సైలెంట్ వార్.. స్థానిక సమరం ముంగిట కొత్త తలనొప్పి.?

Publish Date:Oct 5, 2026

Advertisement

వైసీపీ వరుస సంక్షోభాలతో కూనారిల్లుతోందా? స్థానిక ఎన్నికలను లిట్మస్ టెస్టుగా తీసుకుని 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పూర్వ వైభవం సంతరించుకోవాలని ప్రయత్నిస్తున్న జగన్ కు పార్టీలో పరిస్థితులు అనుకూలంగా లేవా. స్థానిక ఎన్నికల వేళ పార్టీలో అంతర్గత విభేదాలు వైసీపీని బలహీనపరుస్తున్నాయా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది.

స్థానిక ఎన్నికలకు సమాయత్తమయ్యే వ్యూహాలకు సంబంధించి పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ అధినేత జగన్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయని అంటున్నారు. దాదాపుగా ఇరువురి మధ్యా సైలంట్ వార్ జరుగుతోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  స్థానిక ఎన్నికల బహిష్కరణే  బెటర్ అని సజ్జల చెబుతుంటే.. బరిలో నిలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు. ఈ విషయంలోనే ఇరువురి మధ్యా విభేదాలు పీక్స్ కు వెళ్లాయంటున్నారు.   

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ క్షేత్రస్థాయిలో బాగా బలహీనపడింది. పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీకి దూరమయ్యారు. అవుతున్నారు.  జగన్ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ వాయిస్ గా నిలిచి, బలంగా గళం వినిపించి ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, విడదల రజని వంటి నేతలు సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలలో కూడా నామ్ కే వాస్తేగా పాల్గొంటూ ఇన్ యాక్టివ్ గా మారిపోయారు.  దీంతో గ్రామ స్థాయిలో క్యాడర్ బలహీనపడింది.అంతెందుకు,  జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎదురైన పరాజయం రాష్ట్రంలో వైసీపీ పరిస్థితికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  . ఈ నేపథ్యంలో  స్థానిక ఎన్నికల్లో పోటీకి  అభ్యర్థులే కరవయ్యే పరిస్థితి ఉందన్నది సజ్జల వాదనగా చెబుతున్నారు. అధవా పోటీ చేసినా పరాభవం తప్పదనీ, అందుకే బాయ్ కాట్ చేసి పరువు కాపాడుకోవడం బెటరన్నది సజ్జల ఉద్దేశంగా తెలుస్తోంది.  

తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న తరుణంలో ఎన్నికల్లో పోటీ చేసి   ఓడిపోతే మిగిలిన క్యాడర్ కూడా నిరుత్సాహానికి గురయ్యే ప్రమాదం ఉందని సజ్జల జగన్ కు గట్టిగా చెబుతున్నారని అంటున్నారు.  ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తే నిరసన గళం వినిపించినట్లూ ఉంటుంది, పొలిటికల్ గా ఒకింత వెసులుబాటు లభిస్తుందన్నది సజ్జల భావనగా చెబుతున్నారు.  

అయితే జగన్ మాత్రం ఈ ప్రతిపాదనకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఎన్నికలను బహిష్కరించడం వల్ల పార్టీ గ్రామస్థాయి పునాదులు మరింత బలహీనపడతాయని, రాజకీయంగా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి స్థానంలోనూ అభ్యర్థులను నిలబెట్టి పోరాడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.

 

ఈ క్రమంలోనే జగన్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో స్వయంగా సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ప్రతి స్థానానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సిద్ధం చేయాలని, నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో పార్టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించిన సజ్జల తాజా సమీక్షల్లో ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారన్న చర్చ కూడా వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.

 

మరోవైపు, ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు ఎదుర్కొనే న్యాయపరమైన, రాజకీయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక లీగల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ పరిణామాలపై వైసీపీ నాయకత్వం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి కేవలం రాజకీయ పోటీ మాత్రమే కాకుండా, పార్టీ భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్షగా మారనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలన్న జగన్ పట్టుదల పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందా? లేక క్షేత్రస్థాయిలో ఉన్న బలహీనతలు మరోసారి బయటపడతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

[Sajjala, Jagan, Locol Bodies, E;ections, Boycott, Contest, Differences, Telugu One]

By
en-us Political News

  
గతంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, మద్దతు దారుడూ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కుడి భుజంగా వ్యవహరించిన విజయసాయి రంగంలోకి దిగారని చెప్పవచ్చు.  2024 ఎన్నికలలో షర్మిల పోషించిన పాత్ర ఇప్పుడు అంత కంటే బలంగా, ప్రభావమంతంగా విజయసాయి పోషించనున్నారన్న మాట.  
అప్పట్లో చంద్రబాబు సభను బహిష్కరించినప్పటికీ, ఆయన గైర్హాజరైన కాలంలో అసెంబ్లీ   40 రోజులకు మాత్రమే పని చేసింది. అంటే చంద్రబాబు అసెంబ్లీ బహిష్కరణ సమయంలో అసెంబ్లీ 40 పని దినాలు మాత్రమే సమావేశమైంది.
జన్ జీ ఉద్యమంతో తొలి ఎదురుదెబ్బ తిని కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్న మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్డీయే సర్కార్.. ఆ వెంటనే పార్లమెంటులో విపక్షాల ఐక్య ఆందోళనలు, ప్రతిఘటనతో కీలక బిల్లుల విషయంలో వెనక్కు తగ్గక తప్పలేదు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మధ్య పెనవేసుకున్న అన్నా తమ్ముళ్ల బంధం కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్నది. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు సృష్టించి, నాయకుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందన్న పొలిటికల్ ఎట్మాస్మఫియర్ క్రియేట్ చేయడానికి వైసీపీ చేస్తున్నప్రయత్నాలను పవన్, లోకేష్ సమర్ధంగా తిప్పికొట్టడానికి నారా లోకేష్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానం ఊతంగా నిలిచింది.
సాధారణంగా సిగరెట్ తాగిన వాడి పక్కన కూర్చుంటే..ఆ తాగిన వాడి కంటే.. పక్కన కూర్చోని పొగ పీల్చుకునే వారికే ఎక్కువ ప్రమాదం అని చెబుతుంటారు. అది తెలిసిన విషయమే.
Hamid Ansari, Rajya Sabha, Outgoing Vice President of India, pm narendra modi, venkaiah naidu
SASIKALA, JAYALALITHA, DA CASE JUDGEMENT, TAMIL NADU, PANNER SELVAM, SUPREME COURT
ROJA, JAGAN, SPECIAL STATUS, PAWAN KALYAN, YSRCP, YCP, TDP, ANDHRA PRADESH, AP, SPECIAL PACKAGE
TTDP, motkupalli narasimhulu, new governors in india, NDA GOVERNMENT, CHANDRA BABU, KCR, REVANTH REDDY, SOCIAL MEDIA, SPECIAL PACKAGE, SPECIAL STATUS

బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్‌ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్‌ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్‌లో ఏ చిన్న

ఉత్తర్‌ప్రదేశ్‌లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు

తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.