నాడు తల్లి, నేడు పిన్ని: జగన్ రాజకీయ ప్రయోగాలు.!
Publish Date:Oct 14, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై చేసే రాజకీయ ప్రయోగాలు వికటిస్తున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 2014 ఎన్నికలలో తల్లి విజయమ్మను విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీకి దింపారు విజయ్. అయితే ఆ ఎన్నికలలో ఆమె దారుణ పరాజయం పాలయ్యారు. ఆ తరువాత పొలిటికల్ గా ఆమె దాదాపు కనుమరుగయ్యారు. ఇక ఇప్పుడు తన అడ్డాగా చెప్పుకునే పులివెందులలో ఆయన మరో ప్రయోగానికి తెరతీశారు. అదేంటంటే.. పులివెందుల మునిసిపల్ చైర్ పర్సన్ గా సొంత పిన్ని ప్రమీలమ్మను నిలబెట్టనున్నారు. ఈ ప్రయోగమైనా సక్సెస్ అవుతుందా? అన్న చర్చ రాజకీయవర్గాలలోనే కాదు, వైసీపీ శ్రేణులలోనూ, చివరాఖరికి వైఎస్ కుటుంబ సభ్యులలోనూ జోరుగా సాగుతోంది. ఒక వైపు దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబాన్ని దూరం పెడుతూ, మరో వైపు మరో బాబాయ్ వైయస్ మనోహర్ రెడ్డి కుటుంబానికి పెద్ద పీట వేస్తున్న తీరు కుటుంబంలో విభేదాలకు అద్దంపడుతున్నది. జగన్ తన సొంత కంచుకోట పులివెందులలో మున్సిపల్ చైర్పర్సన్ స్థానం కోసం పార్టీ తరఫు అభ్యర్థిగా ఎంపిక చేసిన తీరు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కుటుంబ సభ్యులను కీలక రాజకీయ పదవులకు పోటీకి పెట్టడంపై గత అనుభవాలను బేరీజు వేస్తూ జగన్ వ్యవహార శైలిపై పరిశీలకులు పలు కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే, వైయస్ జగన్ కొన్ని కీలక సందర్భాల్లో తన కుటుంబ సభ్యులను ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిపిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా 2014 సాధారణ ఎన్నికల సమయంలో విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి తన తల్లి వైయస్ విజయమ్మను పార్టీ తరఫున పోటీకి దింపారు. అప్పట్లో వైయస్ విజయమ్మ ఆ ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. తాజాగా పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి కుటుంబ సభ్యురాలికే పెద్దపీట వేస్తున్నారు. పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వైయస్ జగన్ తన బాబాయ్ వైయస్ మనోహర్ రెడ్డి సతీమణి ప్రమీలమ్మను బరిలోకి దించుతున్నారు. పులివెందుల నియోజకవర్గం ఎప్పుడూ వైయస్ కుటుంబానికి తిరుగులేని అడ్డాగా ఉంటూ వస్తోంది. ఇక్కడ పార్టీ అభ్యర్థుల గెలుపుపై ఎలాంటి సందేహాలు లేనప్పటికీ, చైర్పర్సన్ పదవికి ప్రమీలమ్మను ఎంపిక చేయడం ద్వారా స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపారు. పులివెందుల జగన్ కు పెట్టని కోట అయినప్పటికీ.. ఇటీవలి కాలంలో ఆయనకూ, ఆయన పార్టీ అయిన వైసీపీకి కొన్ని ఎదురుదెబ్బలు గట్టిగానే తగిలాయి. 2024 ఎన్నికలలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో స్వయంగా జగన్ మెజారిటీ భారీగా తగ్గింది. ఆ తరువాత పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రమీలమ్మను పులివెందుల చైర్ పర్సన్ గా బరిలోకి దింపడం సాహస ప్రయోగంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఒక వైపు వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల వ్యతిరేకత నిస్సందేహంగా పులివెందుల మునిసిపల్ ఎన్నికలపై పడుతుందని అంటున్నారు. ఈ తరుణంలో ప్రమీలమ్మను బరిలోకి దింపడం ద్వారా ఫలితం ఏమైనా తేడాగా వస్తే కంచుకోటలాంటి పులివెందులలో జగన్ బలం, ప్రతిష్ఠ మసకబారడం ఖాయమంటున్నారు. [YS Jagan Mohan Reddy Political experiments, Pulivendula Municipal Elections, YS Pramilamma, YCP Chairperson Candidate, Telugu One]
http://www.teluguone.com/news/content/ys-jagan-mohan-reddy-political-experiments-45-234394.html
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్లో ఏ చిన్న
ఉత్తర్ప్రదేశ్లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.





